Breaking News

‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు

Published on Fri, 01/20/2023 - 15:32

మహానటి సావిత్రి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. న‌ట‌న‌కే న‌ట‌న‌ను నేర్పిన స‌హ‌జ న‌టి. పాత్ర‌ల‌కే ప్రాణం పోసిన మ‌హాన‌టి ఆమె. అందుకే తరాలు మారినా ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం. తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ల తర్వాత వినిపించే పేరు సావిత్రిదే. చలన చిత్ర రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. హీరోయిన్‌గా కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందిన సావిత్రి చివరికి ఓ అనాథలా కన్నుమూశారు.

చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చిందా?

తన జీవితం ఎందుకు అలా అయ్యిందనేది ఇప్పటికీ ఆశ్యర్యంగానే ఉంటుంది. ఇక మహానటి సినిమా తర్వాత సావిత్రి గురించిన పలు ఆసక్తికర విషయాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరీ తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహానటి మూవీ తర్వాత ఇంట్లో చాలా గొడవలు అయ్యాయంటూ షాకింగ్‌ విషయం చెప్పారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ.. మహానటి చిత్రం తర్వాత నాన్నపై చాలా విమర్శలు వచ్చాయి.

నాన్న వల్లే అమ్మ జీవితం ఇలా అయ్యిందని అందరు తిడుతూ కామెంట్స్‌ చేశారు. అవి చూసి అక్కవాళ్లు(జెమిని గణేషన్‌ మొదటి భార్య పిల్లలు) ‘నీ వల్లే నాన్న పేరు చెడింది’ అని నన్ను తిట్టారు. నాతో మాట్లాడటం కూడా మానేశారు’ అని చెప్పారు. అయితే ఇప్పుడు అంతా సర్దుకుందని, మూడేళ్ల తర్వాత కలిశామని ఆమె పేర్కొన్నారు. రీసెంట్‌గా ఓ ఫంక్షన్‌లో అందరం కలిశామని, అప్పుడు నన్ను హగ్‌ చేసుకుని ‘ఎలా ఉన్నావు’ అని అక్కవాళ్లు పలకరించారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఈ గొడవలపై బాలీవుడ్‌ నటి, జెమిని గణేషన్‌ మూడో భార్య కూతురు రేఖ  సైతం ఫోన్ చేశారట . 

చదవండి: మహేశ్‌ సినిమాకు హాలీవుడ్‌ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నా: రాజమౌళి

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బయోపిక్‌లో ఉన్నది ఉన్నట్లు చూపించడం సాధ్యం కాదని, ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేందుకు కొంచెం మాసాల యాడ్‌ చేస్తారని రేఖ అక్క అన్నారని చెప్పారు.  ఇవేవి పట్టించుకోవద్దని, కొద్ది రోజులకు వాళ్లకే అర్థం అవుతుందిలే అని రేఖ అక్క ఫోన్లో ఓదార్చారని విజయ చాముండిశ్వరి చెప్పుకొచ్చారు. కాగా సావిత్రి, జెమిని గణేషన్‌కు రెండో భార్య అనే విషయం తెలిసిందే. సావిత్రిని పెళ్లి చేసుకునే సమయానికి అప్పటికే జెమిని గణేషన్‌కు పెళ్లయి, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆయన మొదటి భార్య, పిల్లలతో సావిత్రికి సత్సంబంధాలు ఉండేవి. అందరు ఒక్క కుటుంబంలా ఉండేవారని మహానటిలో చూపించిన సంగతి తెలిసిందే. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)