మోనాలిసా బాలీవుడ్ ఎంట‍్రీ.. ఇంటికెళ్లి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్

Published on Thu, 01/30/2025 - 18:10

యూపీలో జరుగుతున్న ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళా ఏకంగా ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. సోషల్ మీడియా పుణ్యమాని ఆమె వీడియో పెద్దఎత్తున వైరల్ కావడంతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగిపోయింది. ఇంకేముంది ఆమె ఫోటోలు, వీడియోలు చూసిన సినీ ప్రముఖులు సైతం ఆమె అందాన్ని ప్రశంసించారు. అసలు పేరు ఇంకా చెప్పట్లేదని బాధపడుతున్నారా? అదేనండి తన తేనేలాంటి కళ్లతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న మోనాలిసా. ఇప్పుడంతా దేశంలో ఎక్కడా చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. పూసలమ్మే ఆ అమ్మాయి అందం తన తలరాతను మార్చనుంది. ఇప్పటికే సినిమాలో ఛాన్స్‌ ఇస్తానని ఓ ఆఫర్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

మహాకుంభ్ మేళాలో పూసలు ‍అమ్ముతున్న మోనాలిసాకు అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మరో అడుగు ముందుకేశారు. మోనాలిసాకు తాను తెరకెక్కించబోతున్న చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్‌లో ఉన్న మోనాలిసా ఇంటికి వెళ్లి మరి ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. తాజాగా మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మిశ్రా కలిసి ఫోటో కూడా బయటకొచ్చింది.

అంతేకాదు.. మోనాలిసా సైతం ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కష్టపడతానని సనోజ్ మిశ్రాకు హామీ కూడా ఇచ్చింది మోనాలిసా. ఇంకేముంది తేనేకళ్ల సుందరిని బిగ్‌ స్క్రీన్‌పై చూసే ఛాన్స్ కూడా ‍త్వరలోనే రానుంది. ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌ అనే పేరుతో సనోజ్ మిశ్రా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తాజాగా ఇవాళ సినిమాలో నటించేందుకు మోనాలిసా సంతకాలు చేయడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది.

ఊహించని విధంగా ఫేమ్..

మహాకుంభ్‌ మేళాకు జీవనోపాధి నిమిత్తం వెళ్లిన మోనాలిసాకు ఊహించని విధంగా ఫేమ్ వచ్చింది. ఓ నెటిజన్ ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్దఎత్తున వైరలైంది. దీంతో అక్కడికెళ్లిన వారంతా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వ్యాపారం కంటే ఆమెను చూసేందుకు ఎక్కువమంది వచ్చారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ వారి తాకిడి పెరగడంతో మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్‌కు పంపించేశారు.

దర్శకుడు సనోజ్ మిశ్రా మాటాడుతూ..' తన రాబోయే చిత్రం "ది డైరీ ఆఫ్ మణిపూర్" కోసం మోనాలిసాను ఎంచుకున్నా. ఈ చిత్రం ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ఇద్దరు కథానాయికల్లో మోనాలిసా కూడా ఉంటారు. మోనాలిసా సింప్లిసిటీకి ముగ్ధుడై నా సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నా.  మోనాలిసా కుటుంబాన్ని ఇంటికి వెళ్లి కలిశా. ఆమె నా సినిమాలో నటించేందుకు అంగీకరించారు. తాను జీవితంలో ఎప్పుడూ నటించలేదనే విషయం నాకు తెలుసు. అదే నేను సవాల్‌గా తీసుకున్నా. మోనాలిసాకు నటనలో శిక్షణ ఇస్తా. ఆ తర్వాత ఏప్రిల్‌లో సినిమా ప్రారంభిస్తాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలు పాపులారిటీ కోసం అసభ్యకరమైన రీళ్లు తయారు చేస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన మోనాలిసా వంటి సాధారణ అమ్మాయి కూడా వినోద ప్రపంచంలో పని చేయడం ద్వారా ముందుకు తీసుకెళ్లవచ్చని నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నా' అని అన్నారు.

సనోజ్ మిశ్రా ఎవరు?

లక్నో నివాసి అయిన సనోజ్ మిశ్రా రచయితగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సనోజ్ ఇప్పటివరకు 15 సినిమాలు తీశారు. 2023లో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే చిత్రాన్ని రూపొందించి ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ సినిమా ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించాడని కొందరు ఆరోపించారు. 
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)