Breaking News

నా మాజీ సతీమణి వేధిస్తుంది.. ఫిర్యాదు చేసిన ప్రముఖ నటుడు

Published on Fri, 02/16/2024 - 11:36

బుల్లితెరపై మహాభారతంలో కృష్ణుడిగా నటించిన నితీష్ భరద్వాజ్ తన భార్యపై మానసిక వేధింపుల కేసు పెట్టారు. ఆయన  భార్య స్మిత  మధ్యప్రదేశ్‌ క్యాడర్‌లో జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. చాలా రోజుల నుంచి స్మిత  తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందంటూ భోపాల్ కమీషనర్ ఆఫ్ పోలీస్‌కి ఆయన ఫిర్యాదు చేశారు.

స్మిత ఆయనకు రెండో భార్య. 1991లో మోనిషా పాటిల్‌తో నితీష్ భరద్వాజ్‌కు మొదటి వివాహం జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు.   ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి అయిన  స్మితను ప్రేమించి నితీష్‌ రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ వారిద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో 2019లో విడాకుల కోసం ధరఖాస్తు చేసుకుంటే 2022లో ముంబై ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసింది. తాజాగా తన రెండో భార్య స్మితపై వేధింపుల కేసు పెట్టడంతో సంచలనంగా మారింది.

 

భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా ఈ ఫిర్యాదును స్వీకరించారు. ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశించారు. ఏడీసీపీ షాలినీ దీక్షిత్‌ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నట్లు కమిషనర్‌ హరినారాయణచారి మిశ్రా తెలిపారు. ఈ కేసులో నిజానిజాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, నితీష్, ఐఏఎస్ అధికారిణి స్మిత ఒకరినొకరు ప్రేమించుకుని 2009లో మధ్యప్రదేశ్‌లో పెళ్లి చేసుకున్నారు. 12 సంవత్సరాల వివాహం తరువాత విబేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు స్మిత వద్దే ఉంటున్నారు. వారిని కలుద్దామనుకుంటే ఆ అవకాశం స్మిత కల్పించడం లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు.  వీరికి 11 ఏళ్ల వయస్సు గల కవల కుమార్తెలు ఉన్నారు. తనను స్మిత మానసిక వేధనకు గురిచేస్తుందని ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.  ప్రముఖ టీవీ షో 'మహాభారతం'లో నటుడు నితీష్ భరద్వాజ్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించి మెప్పించారు. గతంలో ఆయన పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా ఉన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)