కోటి రూపాయల కారులో మోనాలిసా.. ఇప్పుడదే నా ఫ్రెండ్‌!

Published on Wed, 06/18/2025 - 14:35

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌ అంటూ సినిమా అవకాశాల కోసం ఏళ్లతరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు చాలామంది. అదే సమయంలో అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవారూ బోలెడంతమంది ఉన్నారు. అందులో కుంభమేళా వైరల్‌ గర్ల్‌ మోనాలిసా ఒకరు. కుంభమేళాలో పూసలమ్ముకున్న ఈమె.. సోషల్‌ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్‌ అయిపోయింది. సినిమా అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. 

కుంభమేళాతో పాపులర్‌
షాప్‌ ఓపెనింగ్స్‌కు రమ్మని ఆహ్వానాలు అందాయి. అవన్నీ చూసి పొంగిపోయింది మోనాలిసా. జీవితం ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని ఆలోచించింది. అన్నింటినీ నవ్వుతూ ఓకే చెప్పింది. ఈ మధ్యే ఆమె నటించిన ఫస్ట్‌ సాంగ్‌ 'సాద్‌గి' కూడా రిలీజైంది. అందులో మోనాలిసా మరింత అందంగా కనిపించింది. కాకపోతే యాక్టింగ్‌ ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్న కామెంట్లు వినిపించాయి. కెమెరా ముందు నటించడం అదే తనకు తొలిసారి. 

నా ఫ్రెండ్‌.. కెమెరా
ఈ అనుభవం గురించి మోనాలిసా మాట్లాడుతూ.. సింగర్‌ ఉత్కర్ష్‌ శర్మ సర్‌ తన పాటలో నటించాలని అడగ్గానే ముందు మా ఇంట్లో మాట్లాడమన్నాను. వారు ఓకే అన్న తర్వాతే నేను అందులో యాక్ట్‌ చేశాను. అలాగే సాంగ్‌ కూడా నాకెంతగానో నచ్చింది. ఇప్పుడు కెమెరానే నా ఫ్రెండ్‌. కెమెరా ఎదుట కళ్లతోనే భావాలు పలికించడం, డ్యాన్స్‌ చేయడం కొత్తగా బాగుంది అని చెప్పుకొచ్చింది.

రూ.1 కోటి కారులో మోనాలిసా
ఇదిలా ఉంటే తాజాగా మోనాలిసా ఖరీదైన కారులో కూర్చున్న ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఈ కారు ధర దాదాపు రూ.1 కోటి ఉండొచ్చని అంటున్నారు. రూ.100కు పూసల దండ అమ్ముకున్న మోనాలిసా ఇప్పుడు కోటి విలువైన కారులో తిరుగుతుండటం చూసి ఫ్యాన్స్‌ సంతోషంగా ఫీలవుతున్నారు. మోనాలిసా ప్రస్తుతం ద డైరీ ఆఫ్‌ మణిపూర్‌ అనే సినిమా చేస్తోంది.

 

 

చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్‌? వీడియోతో ఆన్సర్‌ దొరికేసింది!

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)