Breaking News

మహాకుంభమేళాలో విజయ్‌.. గెటప్‌ కనిపించొద్దని...!

Published on Mon, 02/10/2025 - 12:45

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాకుంభమేళా (Maha Kumbh 2025)కు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) తల్లితో కలిసి వెళ్లాడు. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో విజయ్‌ దేవరకొండ కాషాయ వర్ణం ధోతీలో కనిపించాడు. మెడలో రుద్రాక్ష మాలలున్నాయి. 

ముఖానికి మాస్కుతో..
అక్కడి​కి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌తోనే కనిపించాడు. బహుశా తన కొత్త సినిమా మేకోవర్‌ లుక్‌ కనిపించకూడదని ఇలా మాస్కుతో కవర్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సైతం తన స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్లింది. జనవరి 13న మొదలైన ఈ పవిత్ర ఉత్సవం.. ఈ నెల 26న శివరాత్రి నాడు ముగియనుంది.

సినిమా
విజయ్‌ దేవరకొండ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో అతిథి పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం ఇతడు గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో ఇది 12వ సినిమా. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సమ్మర్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు భోగట్టా! ఈ మూవీ తర్వాత విజయ్‌.. రాహుల్‌ సంకృత్యాన్‌, రవికిరణ్‌ కోలా సినిమాల్లో నటించనున్నాడు.

చదవండి: పెళ్లి సమయంలో భారీగా ట్రోల్స్‌.. ఇప్పుడు గుడ్‌న్యూస్‌తో సీరియల్‌ నటి

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)