Breaking News

నటుడు జయం రవి పిటిషన్‌ కొట్టివేత

Published on Thu, 07/24/2025 - 09:23

ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న నటుడు రవిమోహన్‌ (జయం రవి). ఈయన భార్యతో వివాహ రద్దు కేసు కోర్టులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గాయని కనిష్కతో ప్రేమాయణం అంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వాటిని నిజం చేసే విధంగా నటుడు రవిమోహన్‌ గాయనీ కనిష్కతో ఆలయాలకు, ఇతర కార్యక్రమాలకు కలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఈయన గాయని కనిష్కతో కలిసి సంగీత కచేరిలో భాగంగా శ్రీలంకకు వెళ్లారు. అక్కడ మంత్రులతో కలిసి తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. 

ఇదిలా ఉంటే రవిమోహన్‌ తన సంస్థకు రెండు చిత్రాలు చేయడానికి అగ్రిమెంట్‌ చేసుకున్నారని, అందుకు గానూ ఆయనకు రూ.6 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చినట్లు, అయితే ఆయన తమ సంస్థకు చిత్రాలు చేయకుండా వేరే సంస్థలకు చేస్తున్నారని, అడ్వాన్స్‌ తిరిగి చెల్లించమని కోరినా , ఇవ్వడం లేదని బాబీ టచ్‌ గోల్ల్‌ యూనివర్సల్‌ సంస్థ చైన్నె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో నటుడు రవిమోహన్‌ కూడా తాను కేటాయించిన కాల్‌షీట్స్‌ను వాడుకోకుండా వృథా చేసినందుకు గానూ ఆ సంస్థే తనకు నష్ట పరిహారంగా రూ.9 కోట్లు చెల్లించాలని కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ కేసుపై ఇటీవల విచారణ జరిగింది. కాగా తాజాగా న్యాయస్ధానంలో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసు పరిష్కారం కోసం ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ, నటుడు రవిమోహన్‌ పిటిషన్‌ను కొట్టి వేసింది. అంతే కాకుండా నటుడు రవిమోహన్‌ రూ.5.9 కోట్లకు సంబంధించిన పత్రాలను 4 వారాలలోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)