Breaking News

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మళ్లీ మొదలుపెట్టిన నటుడు!

Published on Wed, 01/31/2024 - 17:11

తప్పు చేసిందే కాకుండా తప్పించుకోవాలని చూశాడు తమిళ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌. హీరోయిన్‌ త్రిషపై ఈయన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలిసిందే! 'లియో సినిమాలో హీరోయిన్‌ త్రిష అని తెలిశాక తనతో బెడ్‌రూమ్‌ సీన్‌ ఉంటుందని ఆశపడ్డాను, కానీ అది జరగలేదు' అని వ్యాఖ్యానించాడు. ఇందులో అశ్లీల ధ్వనికి హీరోయిన్‌ త్రిష స్పందించింది. తనతో ఇంకే సినిమాలోనూ నటించేదే లేదని తేల్చి చెప్పింది. చిరంజీవి, ఖుష్బూ వంటి పలువురు తారలు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. తన మాటల్లో తప్పు కనిపించలేదుకానీ అందరూ తనను తప్పుపడుతున్నారని ఫీలయ్యాడు మన్సూర్‌.

కోటి అడిగాడు.. రూ.1 లక్ష కట్టమన్న కోర్టు
త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేశాడు. ఈ వ్యవహారంలో తాను అమాయకుడినని, తనకు ముగ్గురి నుంచి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని పిటిషన్‌ వేశాడు. ఇది చూసి బిత్తరపోయిన కోర్టు మన్సూర్‌కు గడ్డిపెట్టింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన నీవు వారిపై పరువు నష్టం దావా వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కోర్టు సమయం వృథా చేసినందుకుగానూ చెన్నైలో అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.1 లక్ష చెల్లించాలంటూ సింగిల్‌ జడ్జ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

పది రోజుల్లో కడతానంటూ ట్విస్ట్‌
ఇది జరిగి నెల రోజుల పైనే అవుతోంది. ఇప్పటివరకు మన్సూర్‌ ఆ రుసుమును కట్టనేలేదు. వారం రోజుల క్రితం కోర్టు ఇదే విషయాన్ని గుర్తు చేయగా మరో పది రోజుల గడువు కావాలన్నాడు నటుడు. అతడి అవస్థను చూసిన న్యాయస్థానం.. ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ఆచితూచి మాట్లాడటం నేర్చుకోమని మొట్టికాయలు వేస్తూనే మరో పది రోజుల గడువు ఇచ్చింది. చివరకు ఆ డబ్బు ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు నటుడు.

స్టేకు నిరాకరించిన న్యాయస్థానం
సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలుకు దరఖాస్తు చేశాడు. మన్సూర్‌ వైఖరికి విస్తుపోయిన న్యాయస్థానం.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించింది. డబ్బు కడతానని అంగీకరించాక ఆ తీర్పును ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించింది. సింగిల్‌ జడ్జి ఎదుటే ఏ విషయమో తేల్చుకుని రావాలని చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. గొడవ సద్దుమణిగిందనుకుంటే ఈయన మళ్లీ మొదలుపెట్టాడేంట్రా బాబూ అని తల బాదుకుంటున్నారు సినీప్రేక్షకులు.

చదవండి: థియేటర్‌లో హనుమాన్‌ చూస్తూ మహిళ వింత చేష్టలు.. వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)