Breaking News

రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఆఫర్లు కూడా పోయాయి!

Published on Wed, 01/07/2026 - 11:37

హీరో ఫ్రెండ్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మధునందన్‌. నిన్నే ఇష్టపడ్డాను, సై, ఇష్క్‌, గీతాంజలి, గుండెజారి గల్లంతయ్యిందే, రభస, లై, వినయ విధేయ రామ.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తాజాగా 'శంబాల' సినిమాతో మరో సక్సెస్‌ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరవగా అనేక విషయాలు పంచుకున్నాడు.

మధునందన్‌ మాట్లాడుతూ.. గుండెజారి గల్లంతయ్యిందే తర్వాత కొన్ని మంచి సినిమాలు చేశాను. అయితే రెండు సినిమాల షూటింగ్‌ కోసం వరుసగా ఆరునెలలు అమెరికాలోనే ఉండిపోయాను. దాంతో చాలామంది ఏమనుకున్నారంటే.. ఇంకా ఉద్యోగం చేస్తూ యాక్టింగ్‌ చేస్తున్నాననుకున్నారు. ఉద్యోగం వల్ల సరైన టైం ఇవ్వలేననుకున్నారు. దానివల్ల 10-15 సినిమా అవకాశాలు పోయాయి. కానీ అప్పటికే నేను జాబ్‌ మానేసి చాలాకాలమైంది.

మోసపోయా..
నా పక్కనే ఉంటూ నా క్యారెక్టర్లు కొట్టేసిన వ్యక్తితో ఇప్పటికీ స్నేహం చేస్తున్నాను. కాకపోతే జాగ్రత్తగా ఉంటాను. వాళ్లలా ఒకరిని తొక్కి ఎదగడం నాకు చేతకాదు. అలాంటివాళ్లను పెద్దగా పట్టించుకోను. నా వరకు వస్తే ఓకే, కానీ నన్ను దాటి కుటుంబం జోలికి వెళ్తే మాత్రం అస్సలు ఊరుకోను.

కెరీర్‌ మొదట్లో ఉద్యోగం, సినిమాలు రెండూ చేశాను. ఓపక్క ఉద్యోగం, మరో పక్క సినిమాలు చేస్తూ రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. అలా నాలుగేళ్లపాటు కష్టపడి సంపాదించిన రూ.25 లక్షలు బిజినెస్‌లో పెట్టాను. అప్పుడు  ఓ వ్యక్తి నన్ను నిండా ముంచేశాడు. ఉన్న డబ్బంతా పోయింది అని మధునందన్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఓటీటీలో ఫీల్‌గుడ్‌ మూవీ.. ఎక్కడంటే?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)