అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు
Breaking News
50 ఏళ్ల వయసులో తండ్రయిన నిర్మాత
Published on Sun, 03/22/2026 - 16:31
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన తండ్రిగా ప్రమోషన్ పొందాడు. 50 ఏళ్ల వయసులో తండ్రయ్యాడు. మధు మంతెన - ఐరా త్రివేది దంపతులకు ఆదివారం (మార్చి 22) తెల్లవారుజామున పండంటి మగ బిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా మధు మంతెన- ఐరా త్రివేది దంపతులు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ ఏడాది జనవరి 15న వెల్లడించారు.
బిడ్డ కోసం ఎదురుచూపులు
భార్య బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మార్చిలో డెలివరీ డేట్ ఇచ్చినప్పటినుంచి బిడ్డ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బాబు ఈ ప్రపంచంలో అడుగుపెట్టగానే వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
రెండో పెళ్లి
హైదరాబాద్‌కు చెందిన మధు మంతెన.. 2015లో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి వైవాహిక జీవితం ఎంతోకాలం సజావుగా సాగలేదు. దీంతో 2019లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యోగా ట్రైనర్ ఐరా త్రివేదిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. ఈయన గతంలో తెలుగులో కార్తీక్ మూవీని నిర్మించాడు. ఆ తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఆమిర్ ఖాన్ గజిని, క్వీన్, సూపర్ 30, రక్త చరిత్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.
చదవండి: ధురంధర్ 2 నుంచి నన్ను తీసేశారనుకున్నా: బాలీవుడ్ నటుడు
Tags : 1