Breaking News

ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్.. వేవ్స్ సమ్మిట్‌కు ప్రత్యేక ఆహ్వానం

Published on Fri, 05/02/2025 - 21:54

అంతర్జాతీయ సినిమా రంగంలో దూసుకెళ్తున్న ఎమ్4ఎమ్ (M4M) చిత్ర హీరోయిన్ జో శర్మకు మరో గౌరవం లభించింది. ఆమెకు 'వేవ్స్‌ సమ్మిట్ 2025' (WAVES Summit 2025)లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) డెలిగేట్‌గా పాల్గొనాలని గౌర‌వ ఆహ్వానం అందింది. కళ, సాంస్కృతికం, సినిమాను ఘనంగా ఆవిష్కరించే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో జో శర్మ పాల్గొనడం  సినిమా రంగంలో ఆమె ఎదుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.

కాగా.. మోటివ్ ఫర్ మర్డర్ (M4M) అనే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో జో శర్మ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ సంస్థ, జో శర్మ మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించాయి.

కాగా.. జో శర్మకు ప్రతిష్టాత్మక వేవ్ల్ సమ్మిట్‌ -2025కు ఆహ్వానం రావడం ఇండియన్-అమెరికన్ ప్రతిభ ప్రపంచ సినీ రంగంలో ఎలా విస్తరిస్తున్నదనేదానికీ నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు ముంబయి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 'వేవ్స్ సమ్మిట్ 2025 ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. మే 4, 2025 వరకు జ‌రిగే ఈ స‌మ్మిట్‌లో 90కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు.

s

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)