Breaking News

వారికి హెచ్చరిక.. లైకా ప్రొడక్షన్స్‌ పేరుతో మోసాలు

Published on Wed, 08/07/2024 - 20:18

సోష‌ల్ మీడియా ప్రపంచంలో చాలా జాగ్రత్తగా మెలగాలి లేదంటే కేటుగాళ్ల చేతికి దొరికిపోతారు. ముఖ్యంగా చాలామంది సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారిని ట్రాప్‌లోకి లాగి నిండా ముంచేస్తారు. ఈ క్రమంలో సినీ ఇండ‌స్ట్రీ పేరుతో మోసం చేయ‌డానికి మోస‌గాళ్లు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి విష‌యాల‌పై  ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించాల‌ని ప్రజలను పోలీసు శాఖ హెచ్చరిస్తూనే ఉంది. తాజాగా లైకా ప్రొడక్షన్స్ పేరుతో అనేక అనధికారిక కాస్టింగ్ కాల్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

కోలీవుడ్‌లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మాత సుభాస్కరన్ నిర్మించారు. లైకా ప్రొడక్షన్స్ పేరుతో అనధికారికంగా కొందరు ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేసి సినిమా ఛాన్స్‌లు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయని ఆ సంస్థ గుర్తించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు లైకా తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్న సినిమాల కోసం ఏవైనా కాస్టింగ్ కాల్‌లు లేదా ఆడిషన్‌లు ఉంటే తమ ధృవీకరించబడిన సోషల్ మీడియా పేజీల ద్వారా మాత్రమే అధికారికంగా ప్రకటించబడతాయని తెలిపింది. సోషల్‌ మీడియాలో అనధికారికంగా ఇలా ఫేక్‌ కాస్టింగ్ కాల్స్‌ల ట్రాప్‌లో చిక్కుకోకూడదని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. 

తమ సంస్థ పేరుతో కాస్టింగ్ కాల్‌లు లేదా ఆడిషన్‌లు నిర్వహించే అనధికార వ్యక్తులు, ఏజెన్సీలపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లైకా ప్రొడక్షన్‌ హెచ్చరించింది. ఇలాంటి వారి సమాచారం మీ దృష్టికి వస్తే సమాచారం ఇవ్వండి అంటూ కోరింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)