Breaking News

'ఆమెతో నటించడం అద్భుతం'.. శోభిత ధూళిపాళ్లపై నటుడు ప్రశంసలు!

Published on Sun, 10/20/2024 - 19:47

టాలీవుడ్ హీరో నాగచైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోంది. తెలుగమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా బాలీవుడ్‌లోనే రాణిస్తోంది. ఇటీవల లవ్-సితార మూవీతో ప్రేక్షకులను పలకరించింది శోభిత. ఇందులో బాలీవుడ్ నటుడు రాజీవ్ సిద్ధార్థ్‌తో జంటగా నటించింది. ప్రస్తుతం హానీమూన్ ఫోటోగ్రాఫర్‌ వెబ్‌ సిరీస్‌లో నటించిన రాజీవ్ సిద్ధార్థ్.. శోభితతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనతో కలిసి నటించడం ఓ మంచి అనుభవమని అ‍న్నారు.

రాజీవ్ మాట్లాడుతూ.. 'ఆమెతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. వర్క్‌షాప్‌ మొదటి రోజు నుంచి సినిమా చివరి దాకా సమష్టింగా పనిచేశాం. శోభిత చాలా అద్భుతమైన సహనటి. మేమిద్దరం సినిమా ఎలా ఉంటుందనే దానిపైనే శ్రద్ధ పెట్టాం. మా సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయి. ప్రతి సీన్‌ని మెప్పించేలా పని చేశాం. ఈ క్రెడిట్ అంతా మా దర్శకురాలు వందనా కటారియాకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆమెకు సినిమా అంటే ప్రాణం. ఈ చిత్రం సిబ్బందిలోని ప్రతి ఒక్కరూ ఆమె విజన్‌ కోసం చాలా కష్టపడ్డారు.' అని చెప్పుకొచ్చారు.

(ఇది చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)

కాగా.. శోభిత ధూళిపాళ్లకు, హీరో నాగచైతన్యకు ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వీరద్దరూ త్వరలోనే వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నారు. నిశ్చితార్థం తర్వాత ఈ జంట తొలిసారి బయట కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. మరోవైపు నాగ చైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. 
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)