Breaking News

హీరోగా లోకేశ్ కనగరాజ్.. మూవీ టీజర్ రిలీజ్

Published on Sat, 11/01/2025 - 18:47

'ఖైదీ', 'విక్రమ్', 'కూలీ', 'లియో' లాంటి సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు హీరో అయిపోయాడు. గత కొన్నిరోజులుగా ఇతడి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. కమల్-రజనీ మల్టీస్టారర్‌కి దర్శకత్వం వహిస్తాడని ఓసారి, లేదు తీసేశారని మరొసారి కామెంట్స్ వినిపించాయి. 'ఖైదీ 2' స్క్రిప్ట్ పని తేలకపోవడంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందని రూమర్స్ వచ్చాయి. వాటి సంగతి అలా పక్కనబెడితే ఇప్పుడు లోకేశ్ హీరోగా కొత్త సినిమాని ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్)

చెప్పాలంటే కొన్ని నెలల క్రితం లోకేశ్ కనగరాజ్ హీరో కానున్నాడనే టాక్ వినిపించింది. తర్వాత అంతా సైలెంట్. ఇప్పుడు మాత్రం అధికారికంగా ప్రకటించారు. 'డీసీ' పేరుతో తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్. అరుణ్ మాతేశ్వరన్ దర్శకుడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. తాజాగా టైటిల్ టీజర్ విడుదల చేయగా ఆకట్టుకునేలా ఉంది.

దేవదాస్ (లోకేశ్ కనగరాజ్) ఒళ్లంతా రక్తంతో చేతిలో కత్తితో నడుచుకుంటూ వస్తుండగా.. మరోవైపు చంద్ర(వామికా గబ్బి) కండోమ్ తీసుకుని ఓ గదిలోకి వస్తుంది. అక్కడికి దేవదాస్ కూడా వస్తాడు. విజువల్స్ గానీ వెనక అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానీ బాగుంది. వచ్చే ఏడాది వేసవిలో మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. మరి డైరెక్టర్‌గా క్రేజ్ తెచ్చుకున్న లోకేశ్.. నటుడిగా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి?

(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)