Breaking News

ఆరుణ్‌ మాదేశ్వరన్‌తో బిగ్‌ప్లాన్‌ వేసిన లోకేశ్‌ కనకరాజ్‌

Published on Fri, 05/09/2025 - 07:05

కోలీవుడ్‌ దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ హీరోగా అవతారమెత్తనున్నారా..? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. లోకేశ్‌ కనకరాజ్‌ ఈ పేరు స్టార్‌ దర్శకులకు ఒక బ్రాండ్‌. మానగరం అనే ఒక చిన్న చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి పెద్ద విజయాన్ని అందుకున్న ఈయన ఈ తరువాత ఖైదీ, మాస్టర్‌, విక్రమ్‌, లియో వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. వీటిలో లియో చిత్రం మినహా అన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. లియో ఆశించిన విజయాన్ని సాధించకపోయినా వసూళ్ల వర్షం కురిపించింది. 

కాగా తాజాగా రజనీకాంత్‌ కథానాయకుడిగా కూలీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా ఈయన తదుపరి ఖైదీ –2, విక్రమ్‌– 2, రోలెక్స్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వమించాల్సిన ఉన్నాయన్నది తెలిసిందే. అదేవిధంగా మరో పక్క నిర్మాతగానూ చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు హీరోగా అవతారమెత్తడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

దీనికి ఇంతకు ముందు నటుడు ధనుష్‌ హీరోగా కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన ఆరుణ్‌ మాదేశ్వరన్‌ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ ఇటీవల నటి శృతీహాసన్‌తో కలిసి ఓ వీడియో ఆల్బమ్‌లో నటించిన విషయం తెలిసిందే.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)