Breaking News

లోకేష్‌ కనకరాజ్‌ చిత్రానికి కొత్త సంగీత దర్శకుడు

Published on Wed, 11/06/2024 - 06:58

మాస్టర్‌, విక్రమ్‌,లియో వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలతో స్టార్‌ దర్శకుడిగా మారిన దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ప్రస్తుతం  రజనీకాంత్‌ హీరోగా 'కూలీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్‌ కనకరాజ్‌ ఇంతకు ముందే నిర్మాతగా మారి ఒక చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్‌ చేసేశారు. కాగా తాజాగా రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా 'బెంజ్‌' అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

లోకేష్‌ కనకరాజ్‌ కథను అందించినప్పటికీ ఈ చిత్రానికి రెమో (శివకార్తికేయన్‌), సుల్తాన్‌ (కార్తి) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ‌ భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ వీడియోను నటుడు లారెన్స్‌ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రం ద్వారా నూతన సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ను  పరిచయం చేస్తున్నారు. గతంలో ఏఆర్‌ రెహమాన్‌, జీవీ ప్రకాష్‌ కుమార్‌, సత్య.సీ వద్ద పలు చిత్రాలకు ఆయన పనిచేశారు. 

అదే విధంగా కట్చిచేర, ఆశ కూడ వంటి ప్రైవేట్‌ ఆల్బమ్‌లో పాడి సంగీతాన్ని అందించి పాపులర్‌ అయ్యారనేది గమనార్హం. లోకేష్‌ కనకరాజ్‌ నిర్మిస్తున్న బెంజ్‌ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా సీనీ రంగప్రవేశం చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇంతకంటే మంచి అవకాశం తనకు రాదన్నారు. దీంతో ఉత్సాహంతో, మరింత బాధ్యతగా పని చేస్తున్నానన్నారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి సంగీతాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)