Breaking News

హీరోగా ఎంట్రీ ఇస్తున్న బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌!

Published on Fri, 10/24/2025 - 08:47

సూపర్‌ హిట్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారాడు దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj). కార్తీతో ఖైదీ, విజయ్‌తో మాస్టర్‌, లియో, కమల్‌ హాసన్‌తో విక్రమ్‌, రజనీకాంత్‌తో కూలీ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. అయితే కూలీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈయన ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇకపోతే కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ కలిసి నటించనున్న చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదన్నది తాజా సమాచారం. ఇక కార్తీ హీరోగా తెరకెక్కనున్న ఖైదీ – 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి!

హీరోగా లోకేశ్‌
అదేవిధంగా హిందీలో అమీర్‌ ఖాన్‌ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు జరిగిన ప్రచారానికి కూడా ఇప్పుడు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కథానాయకుడిగా అవతారమెత్తడం విశేషం. కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం ఫ్రేమ్‌ అరుణ్‌ మాదేశ్వరన్‌ (Arun Matheswaran) దర్శకత్వంలో హీరోగా నటించబోతున్నట్లు చాలా రోజులనుంచే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు గురువారం జరిగినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం లోకేష్‌ కనకరాజ్‌ ఫైట్స్‌, ఆత్మ సంరక్షణ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారట! అలా ఈ చిత్రం కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి: తెలుసు కదా కొన్నేళ్లు మీతో ఉండి పోతుంది 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)