Breaking News

ఆ రంగంలోకి లియో డైరెక్టర్.. అభిమానుల్లో ఆసక్తి!

Published on Wed, 11/29/2023 - 08:17

ఇటీవలే లియో మూవీ సూపర్‌ కొట్టిన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. కోలీవుడ్‌లో ఇప్పుడు ఆయన పేరే సక్సెస్‌కు కేరాఫ్‌గా మారింది. మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన లోకేశ్‌ కనగరాజ్‌.. తొలి చిత్రమే పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత కార్తీ కథానాయకుడిగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించారు. అదీ కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత విజయ్‌తో మాస్టర్‌, కమలహాసన్‌తో విక్రమ్‌ చిత్రాలు సక్సెస్‌ అయ్యాయి. 

ఇలా ఇప్పటికి అదే చిత్రాలు చేసిన లోకేష్‌ కనకరాజ్‌ తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఆయన 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో సెట్‌ పైకి వెళ్లనుంది. కాగా లోకేష్‌ కనకరాజ్‌ ఇప్పుడు నిర్మాతగా మారనున్నారు. అవును ఈ విషయాన్ని ఆయనే తెలుపుతూ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
 
అందులో తాను జీ స్క్వాడ్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ బ్యానర్లో తన శిష్యులకు, మిత్రులకు అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. దర్శకుడిగా తనకు అందించిన ఆదరాభిమానాలను తన చిత్రాలకు అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కాగా తన సంస్థలో నిర్మించనున్న చిత్రం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు లోకేష్‌ కనకరాజ్‌ పేర్కొన్నారు. దీంతో లోకేశ్ కనగరాజ్ చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)