'ఉత్తరాఖండ్‌లో ఆలయం.. ఊర్వశి రౌతేలాపై చర్యలు తీసుకోవాలి'

Published on Fri, 04/18/2025 - 21:10

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌లోనూ ఫుల్ ఫేమస్ అయింది. డాకు మహారాజ్ తర్వతా మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇటీవల రిలీజైన సన్నీ డియోల్ మూవీ జాట్‌లో ఓ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఎప్పుడు వార్తల్లో నిలిచి ఈ ముద్దుగుమ్మ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ సారి ఏకంగా తనకు గుడి కట్టారంటూ కామెంట్స్ చేసింది. ఉత్తరాఖండ్‌లో నాకు ఓ గుడి కట్టారు. బద్రీనాథ్‌కు దగ్గర్లోనే ఊర్వశి దేవాలయం ఉంది. జనాలు అక్కడికి వెళ్లి నా ఆశీర్వాదం తీసుకుంటారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నన్ను భక్తిగా పూజ చేసి నా ఫోటోకు దండలు కూడా వేస్తారని చెప్పుకొచ్చింది. నన్ను ఆ గుడిలో దండమామై అని పిలుస్తుంటారని కూడా తెలిపింది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళ్తే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి అంటూ సలహా కూడా ఇచ్చింది.

తాజాగా ఆమె వ్యాఖ్యలపై స్థానికి పూజారులు స్పందించారు. ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్‌పై మండిపడుతున్నారు. ఊర్వశి రౌతేలా వాదన అందరినీ తప్పుదారి పట్టించేలా ఉందని పూజారి భువన్ చంద్ర ఉనియాల్  అన్నారు. బద్రినాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశీ పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని.. కానీ ఆలయంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆమె వ్యాఖ్యలతో  స్థానిక పూజారులు, మత అధికారులు, బద్రీనాథ్ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆమె గుడి కాదు. ఇలాంటి ప్రకటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఊర్వశీ వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది మత విశ్వాసాలను అగౌరవపరచడమే అని బ్రహ్మకపాల్‌ తీర్థ్‌ పురోహిత్‌ సొసైటీ అధ్యక్షుడు అమిత్‌ మండిపడ్డారు.

(ఇది చదవండి: బద్రీనాథ్‌ పక్కనే నా పేరుపై గుడి.. నాకు పూజలు, పూలదండలు: ఊర్వశి)

బద్రీనాథ్ ధామ్ సమీపంలోని బామ్నిలో ఉన్న ఊర్వశి ఆలయం.. పురాణాల ప్రకారం సతీదేవి శరీరం భాగాలు పడిపోయిన ప్రదేశం నుంచి ఉద్భవించిందని విశ్వసిస్తున్నారు. ఈ పవిత్రమైన ఆలయాన్ని ఊర్వశి దేవికి అంకితం చేశారని చెబుతున్నారు. ఊర్వశి దేవాలయం హిందూ పురాణాలలో సతీదేవితో ముడిపడి ఉందని అంటున్నారు. ఈ ఆలయం 108 శక్తిపీఠాలలో భాగంగా పరిగణించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. వారి సంప్రదాయంలో భాగంగా పూజించే బామ్ని, పాండుకేశ్వర్ గ్రామాల నివాసితుల ఆధ్యాత్మిక ఆలయంంగా అనుసంధానించబడి ఉందని ఆయన తెలిపారు. బ్రహ్మ కపాల్ తీర్థ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ సతీ కూడా రౌతేలా వ్యాఖ్యలను ఖండించారు. ఈ ఆలయం పురాతనమైనదని.. ఊర్వశి దేవితో ముడిపడి ఉందని.. ఏ వ్యక్తితోనూ కాదని తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ఇక్కడి ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఊర్వశి రౌతేలాపై స్థానికులైన బామ్ని, పాండుకేశ్వర్ గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)