Breaking News

నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న టాప్‌ 10 మూవీస్‌ ఇవే.. ట్రెండింగ్‌లో పాత చిత్రం!

Published on Sun, 10/12/2025 - 15:05

ఒటీటీల క్రేజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. థియేటర్స్‌ వెళ్లి సినిమా చూసేవారి కంటే..ఓటీటీలో చూసేవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. మనదేశంలో టాప్‌ 1లో ఉన్న ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ​్‌ నెట్‌ఫ్లిక్స్‌. టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు అన్ని ప్రాంతాల హిట్‌ సినిమాలు ఎక్కువగా ఇందులోనే స్ట్రీమింగ్‌ అవుతుంటాయి. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాలో ఉన్న టాప్‌ 10 సినిమాలపై ఓ లుక్కేద్దాం.

ఎన్టీఆర్‌-హృతిక్‌ రోషన్‌ కలిసి నటించిన యాక్షన్‌ చిత్రం వార్‌2. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్ట్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఫస్ట్‌ షో నుంచే నెగెటివ్‌ టాక్‌ మూటగట్టుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ హిందీ వెర్షన్‌ టాప్‌ 10లో మొదటి స్థానంలో ఉండగా.. తెలుగు వెర్షన్‌ టాప్‌ 5లో ఉంది.

ఇక టాప్‌లో 2లో మూడేళ్ల క్రితం వచ్చిన కాంతార చిత్రం  హిందీ వెర్షన్‌ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్‌ 1’ థియేటర్స్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటి వరకు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. రిషబ్‌ శెట్టి ఖాతాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇక టాప్‌ 3లో యానిమేషన్‌ ఫిల్మ్‌ ‘మహావతార్‌ నరసింహా’ ఉంది. థియేటర్స్‌లో రూ.320 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీల్లోనూ అదరగొడుతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గా రిలీజ్ అయిన ‘ది ఉమెన్‌ ఇన్‌ క్యాబిన్‌ 10’ మూవీ టాప్‌ 4లో కొనసాగుతుంది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్‌.  సైమన్ స్టోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో   కిరా నైట్‌లీ, గై పీర్స్, డేవిడ్ అజాలా కీలక పాత్రలు పోషించారు.

టాప్‌ 6లో సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రం ఉంది.  ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు మృణాల్ ఠాకూర్, రవి కిషన్, రోష్ని వాలియా, విందు దారా సింగ్, దీపక్ దోబ్రియాల్, కుబ్రా సైట్, సంజయ్ మిశ్రా, చుంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో థియేటర్స్‌లో రిలీజై అయిన ఈ చిత్రం.. అపజయాన్ని మూటగట్టుకుంది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తోంది. గత కొన్నివారాలుగా ఈ చిత్రం టాప్‌ 10లో కొనసాగడం గమనార్హం. 

టాప్‌ 7లో  దడక్‌ 2 ఉంది. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో అత్యంత సున్నితమైన కుల వివక్షను చూపించారు.

టాప్‌ 8లో బ్లాక్‌ బస్టర్‌ మూవీ సయ్యారా కొనసాగుతుంది. ఇక టాప్‌ 9 లో క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇన్‌స్పెక్టర్‌ జెండె ఉంది. ఒకప్పటి నొటోరియస్‌ బికినీ కిల్లర్‌ ఛార్లెస్‌ శోభరాజ్‌ కేసును ఛేదించిన ఓ పోలీసు ఆఫీసర్‌ రియల్‌ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించింది. బాలీవుడ్‌ పాపులర్‌ యాక్టర్‌ మనోజ్‌బాజ్‌పాయూ లీడ్‌ రోల్లో నటించారు.  

ఫహాద్‌ ఫాజిల్‌ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఓడుం కుతిర చాదుం కుతిర’టాప్‌ 10లో కొనసాగుతుంది. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్‌, రేవతి పిళ్లై హీరోయిన్లుగా నటించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)