మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్
Breaking News
మైక్ టైసన్ నన్ను బూతులు తిట్టాడు, బయటికి చెప్పలేను: విజయ్
Published on Sun, 08/28/2022 - 13:26
విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్'. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. కథలో లోపాలున్నా విజయ్ నటనకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
అతని రెండేళ్ల కష్టం ప్రతి ఫ్రేములో కనిపిస్తుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించిన మైక్ టైసన్ గురించి విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో మైక్ టైసన్ తనను చాలా సందర్భాల్లో తిట్టాడని, ఆ బూతుల్ని తాను చెప్పాలనుకోవట్లేదని తెలిపాడు. అయితే అవన్నీ టైసన్ కేవలం ప్రేమతోనే అన్నాడని చెప్పుకొచ్చాడు.
'ఇండియా అంటే ఆయనకు ఎంతో గౌరవం. ఇక్కడి ఆహారం, మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తాడు. కానీ పెద్ద సంఖ్యలో జనాల్ని చూస్తే మాత్రం భయపడతాడు. ఓసారి ఆయన ఇండియాకు వచ్చిన క్రమంలో ఆయన్ని చూడటానికి గుంపులుగా వచ్చిన జనాల్ని చూసి హోటల్ నుంచి బయటికి కూడా రాలేదు' అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.
Tags : 1