Breaking News

సితార చేతికి విజయ్ 'లియో'.. అన్ని కోట్లు పెట్టి!

Published on Wed, 07/19/2023 - 20:40

దళపతి విజయ్‌కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. పాజిటివో నెగటివో పక్కనబెడితే ఈ హీరో గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. కొన్నిసార్లు ట్రోల్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్లందరూ విజయ్ 'లియో' కోసం ఎదురుచూస్తున్నారు. అయితే దీని రిలీజ్‌కి ఇంకా మూడు నెలల టైముంది. అంతలోనే ఇతడు టాలీవుడ్‌లో ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'లియో'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. ఇతడి లాస్ట్ మూవీ 'విక్రమ్'.. తెలుగు ప్రేక్షకుల్ని ఓ రేంజులో అలరించింది. అలానే ఆ సినిమాతో 'లియో'కు కనెక్షన్స్ ఉందనే టాక్.. దీనిపై మరింత హైప్‌ని తీసుకొచ్చింది. దీంతో తెలుగులో థియేట్రికల్ రైట్స్ ని ఏకంగా రూ.23 కోట్లకు అమ్మారనే టాక్ వినిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్)

'లియో'.. తెలుగు థియేట‍్రికల్ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాతోనే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతోంది. అయితే విజయ్ మూవీ హక్కులు ఇంత మొత్తానికి అమ్మారనేది మాత్రం రికార్డే. ఎందుకంటే 'వారసుడు' చిత్రాన్ని రూ.18 కోట్లకు అమ్మారని టాక్ వినిపించింది. అప్పుడు ఇప్పుడు నంబర్స్‌ని పోల్చి చూస్తే.. దళపతి విజయ్ సరికొత్త రికార్డ్ సృష్టించినట్లే!

లోకేశ్ కనగరాజ్ తీస్తున్న ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా త్రిష నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఈ మధ్యనే వచ్చిన 'నా రెడీ' అనే పాట ఎంతలా ట్రెండ్ అయిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా విడుదలకు ఇంకా చాలా సమయమున్నప్పటికీ 'లియో' బిజినెస్ గట్టిగానే జరుగుతోంది.

(ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)