Breaking News

నేను అడగలేదు కానీ ఆ డైరెక్టర్ పెళ్లి గిఫ్ట్‌లా డబ్బులిచ్చారు: లయ

Published on Sat, 09/26/2026 - 11:15

ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ల విషయంలో ఎంత రచ్చ జరుగుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్స్ దగ్గర నుంచి చిన్న చిన్న ఆర్టిస్టులకు ఇవ్వాల్సిన పారితోషికాల్ని కొందరు నిర్మాతలు ఎగ్గేస్తుంటారు. కానీ ఒకప్పటి హీరోయిన్ లయకు మాత్రం ఓ దర్శకుడు.. పెళ్లి బహుమతిలా పారితోషికాన్ని ఇచ్చాడు. అయితే ఆయన అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో లయ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: చిరంజీవి అన్నీ చూస్తున్నారు.. కానీ ఇలా మాట్లాడుతారనుకోలేదు)

'నా పెళ్లి రిసెప్షన్‌కి పిలిస్తే చాలా పెద్ద డైరెక్టర్ ఒకరు రాలేకపోయారు. ఒక గిఫ్ట్‌లా ఏదో పార్సిల్ పంపిస్తే ఏదో గిఫ్ట్‌లే అనుకున్నాను. తెరిచి చూస్తే డబ్బులున్నాయి. అంత డబ్బులు ఎందుకు పంపిస్తారు ఎవరైనా? అని చూస్తే అందులో ఓ లెటర్ ఉంది. అమ్మా నేను నీకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇది. అప్పుడు ఇవ్వలేకపోయాను. కనీసం నీ పెళ్లి టైంలో అయినా ఇస్తున్నాను. ఇదే నీ గిఫ్ట్ అనుకో. దీవెనలు అనుకో అని రాసిస్తే నేను షాకైపోయాను. అసలు నేను అడగలేదు. పోయిందనే అనుకున్నాను. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు. వదిలేసుకున్నాను కదా. ఆల్రెడీ అది జరిగి మూడు నాలుగేళ్లు అయిపోయింది. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నాను. ఇక నాతో ఆయనకు అసలు పనిలేదు. ఆయనంతట ఆయనే ఫీలై ఆయన దగ్గర అప్పుడు డబ్బులుండి.. అయ్యో అమ్మాయికి ఇవ్వలేదు. కాబట్టి నేను ఇస్తాననేది మంచి విషయమే కదా' అని లయ చెప్పుకొచ్చింది.

అయితే లయ ప్రస్తావించిన విషయంలోని దర్శకుడు కె.విశ్వనాథ్ అని తెలుస్తోంది. 2004లో ఈయన దర్శకత్వంలో వచ్చిన 'స్వరాభిషేకం'లో లయ హీరోయిన్‌గా చేసింది. షూటింగ్ టైంలో ఇవ్వలేకపోయిన మిగిలిన పారితోషికాన్ని.. 2006లో లయ పెళ్లి చేసుకున్న టైంలో పూర్తిగా ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ కూతురి లవ్‌స్టోరీ.. ట్రైలర్ రిలీజ్)

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)