Breaking News

బేబీ బంప్‌తో తొలిసారి కనిపించిన మెగా కోడలు

Published on Sat, 07/26/2025 - 16:53

మెగా కోడలు లావణ్య త్రిపాఠి త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలోనే అందుకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. రీసెంట్‌గానే భర్త వరుణ్ తేజ్‌తో కలిసి దుబాయి వెళ్లిన లావణ్య.. బేబీ కోసం షాపింగ్ కూడా పూర్తి చేసేసింది. ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. ఈ క్రమంలోనే తొలిసారిగా ఈమె బేబీ బంప్‌తో కెమెరా కంటికి కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

ఇకపోతే మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్‌తో మిస్టర్, అంతరిక్షం సినిమాలు చేసిన లావణ్య త్రిపాఠి.. అతడితోనే ప్రేమలో పడింది. దాదాపు ఆరేడేళ్ల పాటు వీళ్లిద్దరూ లవ్ చేసుకున్నారు. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. అలా పెద్దల్ని ఒప్పించి 2023 నవంబరులో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మే లో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పుట్టబోయే బేబీ కోసం షాపింగ్ కూడా పూర్తి చేసి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు.

లావణ్య త్రిపాఠి విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈమె 'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా తదితర సినిమాలు లావణ్యకు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ గత కొన్నేళ్లలో చేసిన మూవీస్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'సతీ లీలావతి', తనళ్ అనే సినిమాలు ఉన్నాయి. వీటి షూటింగ్ అయితే లావణ్య పూర్తి చేసినట్లు ఉంది. త్వరలో ఇవి రిలీజ్ కావొచ్చు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్‌తో పార్టీ!)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)