Breaking News

మళ్లీ తెరపైకి రాజ్ తరుణ్ ఎపిసోడ్‌.. పోలీసులకు లావణ్య ఫిర్యాదు!

Published on Wed, 09/03/2025 - 22:37

టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నార్సింగి పీఎస్‌లో అతనిపై మరో కేసు నమోదైంది. కోకాపేట విల్లాలో ఉండగా రాజ్‌తరుణ్‌ అతని అనుచరులతో దాడి చేశారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్‌తరుణ్‌తో పాటు అతని అనుచరులైన మణికంఠ, రాజశేఖర్‌, సుశి, అంకిత్‌ గౌడ్‌, రవితేజపై కేసు నమోదు చేశారు. తనపై మూడు సార్లు దాడి చేశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుతో లావణ్య- రాజ్ తరుణ్ ఎపిసోడ్‌ టాలీవుడ్‌లో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

కాగా.. 2016లో రాజ్ తరుణ్‌తో కలిసి కోకాపేట్‌లోని విల్లా కొనుగోలు చేసిన విషయాన్ని కూడా లావణ్య పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని తెలిపారు. అయితే విల్లాలో తాను నివసిస్తున్న సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారని బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా ఆ ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి