Breaking News

అట్టర్‌ ఫ్లాప్‌గా ఆదిపురుష్‌.. ఎట్టకేలకు స్పందించిన బాలీవుడ్‌ స్టార్‌

Published on Thu, 02/08/2024 - 11:15

సినిమా జయాపజయాలను ముందుగా ఊహించడం కష్టం. ఫలానా కథతో సినిమా తీస్తే ఆడుతుంది, ఫలానా కథతో సినిమా తీస్తే ఆడదు అని ముందే పసిగడితే ఇండస్ట్రీలో ఫ్లాపులెందుకు ఉంటాయి? అలా అని తీసుకున్న కథ ఒక్కటి బాగుంటే సరిపోదు.. దాన్ని తెరకెక్కించే విధానం, ప్రేక్షకులను ఆకర్షించేలా తీర్చిదిద్దగలిగే టాలెంట్‌ ఉండాలి. ఇది లేకపోవడం వల్లే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్‌ అతి ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకుంది.

ఏడు నెలల తర్వాత పెదవి విప్పిన నటుడు
గతేడాది జూన్‌ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఎవరూ పెద్దగా మీడియా ముందుకు రాలేదు. దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారి ఈ సినిమా ఫెయిల్యూర్‌పై స్పందించాడు సైఫ్‌ అలీ ఖాన్‌. ఇతడు ఆదిపురుష్‌లో లంకేశ్‌ (రావణుడు)గా నటించాడు. ఇతడి లుక్‌పై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే! సైఫ్‌ అలీ ఖాన్‌ మాట్లాడుతూ.. 'ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నదాన్ని నేను బలంగా నమ్ముతాను. నన్ను నేను స్టార్‌ అని ఎన్నడూ ఫీలవలేదు. నా పేరెంట్స్‌ పెద్ద స్టార్స్‌.. కానీ సింప్లిసిటీకే ఓటేసేవారు.

వాస్తవంలో బతకాలి..
నేను కూడా వాస్తవంలోనే బతకాలనుకున్నాను. ఓటముల గురించి భయపడిపోను. ఆదిపురుష్‌నే ఉదాహరణగా తీసుకుందాం. కొన్నిసార్లు రిస్కు చేయాలి..  ఓటమిని తీసుకోగలగాలి. జీవితమన్నాక అన్నీ ఉండాలి. ఓటమితో బాధపడి ముడుచుకుపోకూడదు. మనం మనవంతు ప్రయత్నించాం, దురదృష్టం కొద్దీ వర్కవుట్‌ కాలేదు. నెక్స్ట్‌ సినిమాకు చూసుకుందాంలే అని ధైర్యంగా ముందుకు సాగిపోవాలి! నేను అదే చేశాను' అని సైఫ్‌ అలీ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఓటీటీలో బేబి హీరో కొత్త సినిమా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్‌..

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)