Breaking News

అలాంటి ఫ్రెండ్‌ అందరికీ దొరకడు.. ఇప్పటికీ నాన్న చిన్నపిల్లాడైపోతాడు

Published on Thu, 08/14/2025 - 13:46

రజనీకాంత్‌ (Rajinikanth) నడుచుకుంటూ వస్తే చాలు రికార్డులు వాటంతటవే వస్తాయి. బస్‌ కండక్టర్‌ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీ ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. ఆగస్టు 15 నాటికి రజనీ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా రజనీ ఆప్త మిత్రుడు మోహన్‌బాబు (Mohanbabu) కూతురు మంచు లక్ష్మి అనేక విషయాలను పంచుకుంది.

నాన్న చిన్నపిల్లాడిగా..
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. రజనీ అంకుల్‌ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు. మాక్కూడా ఆయనంటే చాలా ఇష్టం. అంకుల్‌ వచ్చాడంటే మా నాన్న చిన్నపిల్లాడయిపోతాడు. ఇప్పటికీ వాళ్లిద్దరూ ఒకరినొకరు సరదాగా ఆట పట్టించుకుంటూ ఉంటారు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న అందమైన స్నేహం వారిది. నటులవ్వడానికి ముందు నుంచే ఇద్దరూ మంచి మిత్రులు.

కష్టసుఖాల్లోనూ..
మా నాన్న ఎప్పుడైనా బాధలో ఉంటే అంకుల్‌ సపోర్ట్‌గా నిలబడతాడు. అలాగే అంకుల్‌కు ఏదైనా కష్టమొచ్చిందంటే నాన్న తోడుగా ఉంటాడు. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇద్దరూ కలిసే ఉంటారు. అలాంటి ఫ్రెండ్‌ దొరకాలని ప్రతి ఒక్కరూ ఆ దేవుడిని కోరుకోవాల్సిందే! పెదరాయుడు సినిమాలో అంకుల్‌ గెస్ట్‌ రోల్‌ చేశాడు. 

పెదరాయుడు మూవీలో..
నిజానికి ఆయనకు ఆ సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఫ్రెండ్‌షిప్‌ కోసం మాత్రమే ఆ మూవీలో యాక్ట్‌ చేశాడు. నాన్న కోసం ఆయన స్వయంగా రాయలసీమ రామన్న చౌదరి సినిమా కథ రాసిచ్చాడు. అదీ వారి ఫ్రెండ్‌షిప్‌ గొప్పదనం. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్‌లోనూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

చదవండి: ఆ హీరోయిన్‌ మగాడిలా ఉంటుందన్న మృణాల్‌.. కౌంటరిచ్చిన మృణాల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)