Breaking News

లపతా లేడీస్ అరుదైన ఘనత.. ఏకంగా హాలీవుడ్ చిత్రాలతో పోటీ!

Published on Tue, 01/28/2025 - 15:23

బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లపతా లేడీస్. గతేడాది రిలీజైన ఈ సినిమా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం  చేసుకుంది.

ప్రతిష్టాత్మక జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు లపతా లేడీస్ ఎంపికైంది. ఈ ఏడాది ఈ ప్రైజ్‌కు అర్హత సాధించిన చిత్రాల్లో భారత్ నుంచి ఈ మూవీ నిలిచింది. ఈ హిట్ సినిమా ఏకంగా హాలీవుడ్ భారీ చిత్రాలైన క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్, జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, పూర్ థింగ్స్, సివిల్ వార్  లాంటి సూపర్ హిట్‌ సినిమాలతో పోటీపడుతోంది. బెస్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీ విభాగంలో లపతా లేడీస్‌ను ఎంపిక చేశారు. ఈ ఏడాది మార్చి 14న జరిగే అవార్డుల వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా విజేతలను ప్రకటిస్తారు. కాగా.. విమర్శకుల ప్రశంసలు పొందిన లపాతా లేడీస్ విడుదలైనప్పటి  నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది.

కాగా.. లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్  లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్‌ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్‌ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్  కీలక పాత్రల్లో నటించారు.

ఓపెన్‌ హైమర్‌తో ఢీ..

కాగా.. గతేడాది ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల్లో 'ఓపెన్ హైమర్' సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ లాంటి విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. 2023 జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 మిలియన్ డాలర్స్ పెడితే.. 1000 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.7700 కోట్లకు పైమాటే.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)