Breaking News

విజయ్-సమంత కొత్త పాట.. ఆ సీన్స్ అయితే!

Published on Wed, 07/12/2023 - 17:05

హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. ఫస్ట్ సింగిల్ 'నా రోజా నువ్వే' అని ప్రేమికులందరినీ కట్టిపడేశారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. 'ఆరాధ్య' అని సాగే ఈ పాటని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఇప్పుడు ఇది ప్రేమికుల గీతంలా నిలిచిపోయేలా కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఇది టీజర్ అంటే.. 'సలార్' ఇలా ఉండుంటే మాత్రం!)

ఆరాధ్య అంటూ సాగే ఈ పాటను శివ నిర్వాణ తెలుగులో రాయగా.. తమిళంలో మదన్ కార్కీ సాహిత్యమందించారు. తెలుగు, తమిళంలో సిద్ శ్రీరామ్, చిన్మయి పాడారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన మ్యూజిక్ శ్రోతలకు వినసొంపుగా ఉంది. ఈ పాటలో సమంత, విజయ్ కెమిస్ట్రీ అయితే హైలెట్ ఉంది. మరీ ముఖ్యంగా ఈ పాటలో శివ నిర్వాణ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ అంతా ఫిదా అవుతున్నారు. 'నా రోజా నువ్వే' పాట యూట్యూబ్‌లో వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఈ సెకండ్ సింగిల్‌ 'ఆరాధ్య'తో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కావడం గ్యారంటీ అనిపిస్తుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమాని తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

(ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!)

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి