Breaking News

దూరం పెట్టారంటూ నటి ఖుష్బూ ఆవేదన

Published on Tue, 12/31/2024 - 07:46

తమిళనాడు రాష్ట్ర బీజేపీ వర్గాలు తనను దూరం పెట్టాయని మహిళా నేత, సినీ నటి ఖుష్బూ సుందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదనను ఓ తమిళ మీడియాతో ఆమె పంచుకున్నట్టు  వార్తలు వెలువడ్డాయి. సినీ రంగంలో ఖుష్బూకు ఉన్న అభిమానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు గుడి కట్టిన అభిమానులు ఉన్నారు. రాజకీయంగా తన ప్రయాణాన్ని డీఎంకేతో ఆమె శ్రీకారం చుట్టారు. అయితే అక్కడ ఇమడ లేక కాంగ్రెస్‌లో చేరారు. చివరకు బీజేపీలో చేరి రాజకీయ ప్రయాణం సాగిస్తున్నా ఆశించిన మేరకు ఆమెకు గుర్తింపు అన్నది దక్కడం లేదని అభిమానులు పేర్కొంటూ వచ్చారు. 

అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఓ నియోజకవర్గం సీటు ఆశించగా, మరో నియోజకవర్గాన్ని బీజేపీ పెద్దలు అప్పగించారు. లోక్‌సభ ఎన్నికలలో సీటును ఆశించగా నిరాశ తప్పలేదు. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలి పదవిలో కొంత కాలం పనిచేసినా పూర్తి స్థాయిలో ఆమెకు న్యాయం అన్నది బీజేపీలో దక్కలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేసేవారు. 

ఈ పరిస్థితులలో తన ఆవేదనను ఆమె ఓ తమిళ మీడియాతో పంచుకున్నారు. తనను రాష్ట్ర బీజేపీ నేతలు దూరం పెట్టి ఉన్నారని, తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, సమాచారం కూడా లేదంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయంగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను ప్రశ్నించగా పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానాలు అన్నది తాను ఎవ్వరికీ ఇవ్వనని, ఈ వ్యవహారాలను పార్టీ నేత కేశవ వినాయగం చూసుకుంటారని, ఖుష్బూ ఆరోపణల గురించి తనకు తెలియదంటూ దాట వేయడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)