Breaking News

అక్కగా సీఎం విజయ్‌ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్‌

Published on Wed, 05/27/2026 - 12:20

తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ప్రముఖ సినీ నటి, బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలు కుష్బూ అభిప్రాయపడ్డారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని ఆమె ప్రశ్నించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్‌, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్‌ను కుష్బూ నేతృత్వంలోని బుల్లితెర నిర్మాతల సంఘం ప్రతినిధులు కలిసి ఒక కోరికల వినతిపత్రాన్ని సమర్పించారు.

సమస్యల పరిష్కారానికి సీఎం హామీ
ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం కుష్బూ మీడియాతో మాట్లాడారు. బుల్లితెర రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా నిర్మాతల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచామన్నారు. తమ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన సీఎం విజయ్‌, మంత్రి రాజమోహన్‌ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కుష్బూ తెలిపారు.

విజయ్‌ నా తమ్ముడు.. 
ముఖ్యమంత్రి విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుష్బూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం విజయ్‌ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాననని పేర్కొన్నారు.. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు నిండిపోయిందంటూ చాలా ఎమోషనల్‌ అయ్యానని తెలిపారు. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం నాకు కలిగిందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యమేనా?, విజయ్‌ పగ్గాలు చేపట్టిన కేవలం 10 రోజుల్లోనే ఎలా మార్చగలరు? ముఖ్యమంత్రికి కాస్త సమయం ఇవ్వండి. తమిళనాడులో కచ్చితంగా మార్పు వస్తుంది అని వ్యాఖ్యలుచేశారు.
 

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

సొంత ఊరు జాతరలో స్టెప్పులు వేసిన దేవిశ్రీ ప్రసాద్ (ఫొటోలు)

+5

ఎలిమినేట‌ర్ పోరు.. నితీశ్ రెడ్డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ (ఫొటోలు)