Breaking News

రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుంకుమ భాగ్య సీరియల్ నటి

Published on Sun, 06/08/2025 - 15:58

కుంకుమ్ భాగ్య సీరియల్ ఫేమ్ పూజా బెనర్జీ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తాజాగా తాను రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పలు సీరియల్స్‌తో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామకు ఇప్పటికే సనా అనే మూడేళ్ల కూతురు ఉన్నారు. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను అందరితో పంచుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం.. ఇప్పుడు నలుగురు కుటుంబ సభ్యులం అయ్యామంటూ శనివారం తన జీవితంలోకి మరో బిడ్డకు ఆహ్వానం పలికింది బాలీవుడ్ బ్యూటీ.

అనేక టీవీ సీరియల్స్‌తో  తన నటనకు పేరుగాంచిన పూజా బెనర్జీ ప్రముఖ స్విమ్మర్, ఒలింపియన్ సందీప్ సెజ్వాల్‌ను వివాహం చేసుకుంది. 
పూజ ఈ రోజు ఉదయం మగబిడ్డను ప్రసవించింది.. మేమందరం చాలా సంతోషంగా ఉన్నామని ఆమె భర్త సందీప్ తెలిపారు. కాగా.. కొత్త ఏడాది ప్రారంభంలో తాను గర్భం ధరించినట్లు అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత తన బేబీ బంప్ ఫోటోషూట్‌ను షేర్ చేసింది.

పూజా బెనర్జీ బాలీవుడ్‌లో చంద్ర నందిని, దిల్ హి తో హై, కసౌతి జిందగీ కే 2, కుంకుమ్ భాగ్య, బడే అచ్చే లగ్తే హై 2 లాంటి ప్రముఖ సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా పూజా కొన్ని వెబ్ సిరీసుల్లో కూడా భాగమైంది.   కెహ్నే కో హమ్సఫర్ హై అనే షోలో నటనతో పూజా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చివరిసారిగా 2023లో వచ్చిన బడే అచ్చే లగ్తే హై -2 సీరియల్‌లో కనిపించింది. ఆ తర్వాత పూజ నటనకు దూరంగా ఉంది. తాజాగా ఆమె రెండవ బిడ్డకు జన్మనివ్వడంతో నటనకు కొద్ది రోజులు విరామం తీసుకోనుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)