Breaking News

రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?

Published on Sat, 06/21/2025 - 14:00

ఏ సినిమా అయినా సరే హీరోయిజం పండాలంటే అందుకు ఎదురుగా ఉన్న పాత్ర కూడా అంతే పండాలి. ఇప్పుడు థియేటర్లలోకి వచ్చిన 'కుబేర' విషయంలోనూ ఇదే జరిగినట్లు అనిపిస్తుంది. ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna Akkineni) లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ తనదైన విలనిజంతో నటుడు జిమ్ షర్బ్ ఆకట్టుకున్నాడు. ఇదే ఇతడికి తొలి సినిమా అయినా సరే.. విలనిజంతో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఇంతకీ ఇతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

ముంబైకి చెందిన జిమ్ షర్బ్ సీనియర్ నటుడేం కాదు. ఇతడి వయసు జస్ట్ 37 ఏళ్లే. తండ్రి ఉద్యోగం వల్ల చిన్నప్పుడే విదేశాలు తిరిగిన జిమ్.. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ సైకాలజీ చేశాడు. తర్వాత 2014లో హిందీలో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తొలి మూవీ షురురత్ కి ఇంటర్వెల్ ఫ్లాప్. దీంతో రెండేళ్లు వెయిటింగ్ తప్పలేదు. 2016లో వచ్చిన 'నీర్జా' ఇతడి కెరీర్‌ని మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. అలా కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: 'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?)

బాలీవుడ్‌లో పద్మావత్, సంజు సినిమాల్లో ఇతడు విలనిజంతో ఆకట్టుకున్నాడు. అలా శేఖర్ కమ్ముల దృష్టిలో పడ్డాడు. 'కుబేర'లో అవకాశం దక్కించుకున్నాడు. స్వతహాగా హిందీ నటుడు అయినప్పటికీ.. డబ్బింగ్‌కి సరిపోయేలా యాక్టింగ్ చేయగలిగాడు. సినిమాలో ఇతడి నటనకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. మూవీ చివర్లో ఇతడి పాత్ర కూడా బిచ్చగాడిగా కనిపించడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

అలా తెలుగులో 'కుబేర' సినిమాతో తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్న జిమ్.. త్వరలో మరిన్ని తెలుగు చిత్రాల్లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. తెలుగులో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ విలనిజం చూసి చూసి జనాలకు మొనాటనీ వచ్చేసింది. ఇలాంటి టైంలో జిమ్‌కి అవకాశాలు వస్తే టాలీవుడ్‌లో కొత్త విలన్ పుట్టుకొచ్చినట్లే.

(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్