Breaking News

'కుబేర'కు టైటిల్‌ కష్టాలు..

Published on Sun, 02/23/2025 - 07:26

 ఏప్రిల్‌ నెలలో విడుదలకు సిద్ధమౌతున్న ‘కుబేర’ సినిమాకు టైటిల్‌ సమస్యలు ఎదురౌతున్నాయి. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్‌–ఇండియన్‌ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ  భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సర్భ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకాలపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్‌ వివాధంలో చిక్కుకుంది.

కుబేర సినిమా టైటిల్ తనదే అని తాను 2023 నవంబర్ 29వ తేదీనే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించానని త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ నిర్వాహ కుడు, సినీ నిర్మాత నరేందర్ తెలిపారు. 2024 మార్చి 5 నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల కుబేర అనే సినిమా టైటిల్‌కు కాపీ చేసుకుని టైటిల్‌కు ముందు శేఖర్ కమ్ముల అని పెట్టి తమ సినిమాకు ఇబ్బంది కలిగిస్తున్నాడని ఆయన ఆవేదనవ్యక్తం చేశారు.  

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శేఖర్ కుమ్ముల కుబేర టైటిల్ కాపీ చెయ్యగానే తాను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సంప్రదిస్తే వారు పెద్దవారితో ఎందుకు పెట్టుకుంటున్నారు అంటూ తమనే బెదిరిస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. న్యాయం జరుగకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. 
 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)