Breaking News

'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?

Published on Sat, 06/21/2025 - 11:11

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలారోజుల తర్వాత మళ్లీ జోష్ కనిపిస్తోంది. వేసవిలో స్టార్ హీరోల సినిమాలేవి రాకపోవడంతో చాలా డల్‌గా ఉంది. నాని 'హిట్ 3' కూడా మే నెలలోనే రిలీజైనప్పటికీ కొన్నిరోజులు మాత్రమే థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. ఇప్పుడు 'కుబేర' విషయంలో రిలీజ్‌కి ముందు పెద్ద హడావుడి గానీ హైప్ గానీ లేదు. తొలిఆట తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే తొలిరోజు వసూళ్లలో మంచి నంబర్స్ కనిపించాయి.

తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు గానీ తమిళనాడులో మాత్రం సాంకేతిక కారణాలతో విడుదలకు ముందురోజు బుకింగ్స్ తెరిచారు. అయినా సరే మౌత్ టాక్ ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్‌గానే వస్తోంది. అలా తొలిరోజు తెలుగు, తమిళంలో కలిపి రూ.13 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నంబర్స్ ఇంకా పెరగొచ్చు అనిపిస్తుంది. చూడాలి మరి ఎంత కలెక్షన్స్ వస్తాయో?

(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)

ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకు తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకుడు. తొలిరోజు వసూళ్ల బట్టి చూస్తే ధనుష్‌కి కెరీర్ పరంగా ఇది రెండో బిగ్గెస్ట్ కలెక్షన్ కాగా.. నాగార్జున, శేఖర్ కమ్ములకు మాత్రం ఇదే అత్యధికం. ఎందుకంటే నాగ్ సినిమాలన్నీ తెలుగు వరకు పరిమితం. అందువల్ల ఓ మాదిరి వసూళ్లు వచ్చేవి. ఇక దర్శకుడు కమ్ముల ఇప్పటివరకు సింపుల్ బడ్జెట్ మూవీస్ తీస్తూ వచ్చాడు. కాబట్టి ఈ వసూళ్లు వీళ్లకు ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్‌ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'కుబేర' మేకింగ్ వీడియో.. చెత్తకుప్పని కూడా)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)