Breaking News

కుబేర 2.. ధనుష్‌ను రీప్లేస్‌ చేసే దమ్మున్న తెలుగు హీరో

Published on Mon, 06/30/2025 - 08:00

ప్రస్తుతం సీక్వెల్స్‌ యుగం నడుస్తోంది. పలు సినిమాలు ముందుగానే 1,2,3 భాగాలు ఉంటాయని ప్రకటించి తీస్తుంటే మరికొన్ని మాత్రం సినిమా సక్సెస్‌ తర్వాత మాత్రమే ఎనౌన్స్‌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా భారీ విజయాన్ని దక్కించుకోవడంతో పాటు  భారీ చర్చోపచర్చలకు కారణం కూడా అయిన సినిమాగా కుబేర ను చెప్పుకోవచ్చు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయి మరిన్ని రికార్డులకు చేరువవుతోంది. మరోవైపు అనేక రకాల చర్చలకు కూడా ఈ సినిమా  విజయం దారి తీసింది. ముఖ్యంగా  మన టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల కుబేర సినిమాకు హీరోగా ధనుష్‌ను ఎంచుకోవడం ఆ సినిమా ప్రారంభాన్ని కన్నా ఇప్పుడే అత్యంత చర్చనీయాంశంగా మారింది. 

అంత బలమైన సబ్జెక్టు ఉన్న, లోతైన నటనకు అవకాశం ఉన్న చిత్రంలో  మన తెలుగు నటుల్లో ఎవరూ ఎందుకు హీరోగా చేయలేకపోయారు? లేదా శేఖర్‌ కమ్ముల చేయించలేదా? లేక అసలు ధనుష్‌ స్థాయిలో పూర్తి డీ గ్లామర్‌ పాత్రలో నటించగల దమ్ము ఉన్న నటుడు టాలీవుడ్‌లోనే లేడా అంటూ సోషల్‌ మీడియా వేదికగా చర్చోపచర్చలు వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి.  

ఈ నేపధ్యంలోనే తొలుత  టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండను శేఖర్‌ కమ్ముల బిచ్చగాడి పాత్ర కోసం సంప్రదించారని అయితే తిరస్కారం ఎదురైందని ఒక ప్రచారం కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటివే మరికొన్ని కూడా వచ్చినప్పటికీ అవి ఎంత వరకూ నిజమో తెలీదు.. సరే ఒకరిద్దరు ఒప్పుకోలేదు మరి ఇంకెవరూ శేఖర్‌ కమ్ములకు తట్టలేదా..?అంటూ ఈ చర్చల సందర్భంగా కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు తమ వంతుగా  కొన్ని పేర్లు కూడా తెరమీదకు తెస్తున్నారు. అందులో అత్యధికులు పేర్కొంటున్న పేరు అనూహ్యంగా ఓ చిన్న హీరోది కావడం విశేషం.అతడే అల్లరి నరేష్‌. 

ప్రముఖ దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఇద్దరు కుమారుల్లో ఒకడైన అల్లరి నరేష్‌ ఒకప్పుడు సీనియర్‌ కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్‌ స్థానాన్ని భర్తీ చేస్తాడని చేసేశాడని కూడా భావించారు. అయితే కొంత కాలంగా ఆయన కెరీర్‌ అంత సంతృప్తికరంగా లేదు. అయితే జయాపజయాలకు అతీతంగా అల్లరి నరేష్‌ మాత్రం వైవిధ్యభరిత పాత్రల్లో తనను తాను నిరూపించుకుంటున్నాడు నేను, గమ్యం, నాంది, శంభో శివ శంభో, ఉగ్రం, బచ్చలమల్లి... వంటి చిత్రాల్లో అల్లరి నరేష్‌ నట విశ్వరూపాన్ని మనం చూశాం. ఈ చిత్రాల జయాపజయాలు అటుంచితే అల్లరి నరేష్‌ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. 

ఈ నేపధ్యంలో ధనుష్‌ను అడ్డం పెట్టుకుని తెలుగు హీరోలు, నటులను తీసి పారేస్తున్నవారిని ఎదుర్కునే క్రమంలో అనేక మంది తెలుగు సినీ అభిమానులు అల్లరి నరేష్‌ను అస్త్రంగా మారాడు. అలాంటి వారిలో కొందరు మరో అడుగు ముందుకేసి కుబేర 2 సినిమా తీయాలని అందులో హీరోగా అల్లరి నరేష్‌ను ఎంచుకోవాలని సూచిస్తూ, ఆ సినిమా కధ సైతం అందుకు అనువుగానే ఉంటుందని ఊహాగానాలు చేసేస్తున్నారు. ఎంతో కాలంగా సినీ పరిశ్రమలో ఉన్నా స్టార్‌ హీరో కాలేకపోయినా, వైవిధ్య భరిత పాత్రలు ధరించడం ద్వారా స్టార్స్‌ని తలదన్నేలా సినీ ప్రేక్షకుల గుండెల్లో అల్లరి నరేష్‌ కొలువుదీరాడని కుబేర చిత్రం విజయానంతర పరిణామాలు తేల్చేశాయి.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)