Breaking News

సుభద్రలా ఉండలేను!: కృతీ శెట్టి

Published on Sat, 06/01/2024 - 03:02

‘‘మనమే’ మూవీ పర్ఫెక్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ప్రతి సన్నివేశంలో వినోదం ఉంటుంది. అలాగే వండర్‌ఫుల్‌ కిడ్, పేరెంట్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి. అది గ్లోబల్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవుతుంది. ఈ సినిమా మొత్తం మా ముగ్గురి పాత్రల (శర్వా, కృతి, విక్రమాదిత్య) చుట్టూ తిరుగుతుంది.. అందుకే ‘మనమే’ అనే టైటిల్‌ పెట్టాం’’ అని హీరోయిన్‌ కృతీ శెట్టి అన్నారు. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమాదిత్య కీలక పాత్ర చేశాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై రామ్‌సే స్టూడియోస్‌ ప్రోడక్షన్‌లో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి పంచుకున్న విశేషాలు... 

∙‘మనమే’లో నా పాత్ర పేరు సుభద్ర. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి ఇది వైవిధ్యంగా ఉంటుంది. నేను క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్‌ చేశాను. కానీ, తొలిసారి ‘మనమే’లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండే పాత్ర చేశాను. నిజ జీవితంలో నాకు పెద్దగా కోపం రాదు.. గట్టిగా అరవను. చాలా కామ్‌గా ఉంటాను. చెప్పాలంటే సుభ్రద్రలా స్ట్రిక్ట్‌గా ఉండలేను. అందుకే 

ఈ పాత్ర చేయడం నాకు పూర్తిగా కొత్తగా అనిపించింది. ఈ పాత్ర కోసం డైరెక్టర్‌ శ్రీరామ్‌గారి విజన్‌ని ఫాలో అయ్యాను. 

నా తొలి మూవీ ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్రకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు. ‘ఉప్పెన’ రస్టిక్‌ లవ్‌ స్టోరీ. ‘మనమే’ రొమాంటిక్‌ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. నేను చేసిన సుభద్ర పాత్రలో చాలా భావోద్వేగాలున్నాయి. అది ప్రేక్షకులకి నచ్చుతుందనే ఆశిస్తున్నాను. సినిమా సక్సెస్,  ఫెయిల్యూర్‌ మన చేతుల్లో ఉండదు. నా వరకూ పాత్రకి న్యాయం చేస్తాను. మన చేతిలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి, ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను. 

ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. ఆ కమిట్‌మెంట్స్‌ వల్లే తెలుగులో గ్యాప్‌ వస్తోంది. పైగా రొటీన్‌ పాత్రలు కాకుండా వైవిధ్యంగా ఉన్నవి మాత్రమే చేయాలనుకుంటున్నాను. ‘బాహుబలి’ చిత్రంలో అనుష్కగారిలా నాకు మహారాణి పాత్ర చేయడం ఇష్టం. అలాగే యాక్షన్, మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ రోల్స్‌ కూడా చేయాలని ఉంది. నాకు వీలు కుదిరినప్పుడు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటాను.

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)