Breaking News

అంత జరిగినా కూడా నేను వెనుకడుగు వేయలేదు: కృతిసనన్‌

Published on Fri, 09/08/2023 - 06:52

సినిమా రంగంలో రాణించడానికి ప్రతిభ ఉంటే చాలదు. కృషి, శ్రమ, అన్నింటికీ మించి అదృష్టం చాలా ముఖ్యం. అయినా ఒక్కోమెట్టు ఎక్కాలంటే ఎన్నో అవమానాలను, చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటుంటారు. బాలీవుడ్‌ నటి కృతిసనన్‌ ఇలాంటి అవమానాలను ఎదుర్కొందట. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపే ఈ బాలీవుడ్‌ బ్యూటీ ఇంతకుముందే తెలుగులో మహేష్‌బాబు సరసన నేనొక్కడినే చిత్రంలో నటించింది.

(ఇదీ చదవండి:  Jawan Review: 'జవాన్‌' మూవీ రివ్యూ)

ఇటీవల ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ఆదిపురుష్‌ చిత్రంలో సీతగా నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కృతిసనన్‌కు పెద్దగా గుర్తింపు రాకపోయినా ఈమె హిందీలో నటించిన 'మిమి' చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టింది. అలాంటి నటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తొలి రోజులను గుర్తు చేసుకుంది.

మొదట్లో మోడల్‌గా చేస్తూనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పింది. ఇందుకు చాలా అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పింది. 'చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక డాన్స్‌ సన్నివేశంలో నేను పొరపాటు చేయడం వల్ల నృత్య దర్శకుడు చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఒక ఫామ్‌హౌస్‌లో షూట్‌. ఆ ప్రాంతమంతా గడ్డితో పాటు తేమగా ఉంది. అందువల్ల నా హీల్స్‌ ఆ గడ్డిలో చిక్కుకుపోయాయి. డ్యాన్స్‌లో సరైన మూమెంట్‌ రాలేదు. దీంతో డ్యాన్స్‌ మాస్టర్‌ ఫైర్‌ కావడమే కాకుండా చెత్తగా మాట్లాడాడు. ఆ సమయంలో సుమారు 50 మంది మోడల్స్ అక్కడ ఉన్నారు. అలాగని తాను వెనుకడుగు వేయలేదు.' అని నటిగా తన పయనాన్ని పట్టుదలతో కొనసాగించానని పేర్కొంది. ఆ తరువాత ఆ డానన్స్‌ మాస్టర్‌తో కలిసి పనిచేసినట్లు చెప్పింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)