Breaking News

ముందస్తు బెయిల్‌ కోసం క్రిష్‌ పిటిషన్‌ .. విదేశాలకు నిర్మాత కుమారుడు

Published on Fri, 03/01/2024 - 06:59

డ్రగ్స్‌ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్‌ క్రిష్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్‌ అట్లూరి, సందీప్‌లు కూడా హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్‌ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొకైన్‌ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూపు డైరెక్టర్‌ వివేకానందతో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితులుగా ఉన్న డైరెక్టర్‌ క్రిష్‌తో పాటు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్‌ ఇళ్లకు 160 సీఆర్‌పీసీ నోటీసులు అంటించారు.

బెంగళూరులో ఉన్న రఘు చరణ్‌ అట్లూరి గురువారం గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హజరయ్యారు. ఆయనను వైద్య పరీక్షలకు తరలించారు. కాగా, లిషీ సోదరి నటి కుషిత గచ్చిబౌలి స్టేషన్‌కు వచ్చి తన సోదరి లిషీ ఇంటికి రావడం లేదని పోలీసులకు తెలిపింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాలని, దీనిపై లిషీకి సమాచారం ఇవ్వాలని పోలీసులు కుషితకు చెప్పినట్టు సమాచారం. సందీప్, శ్వేతల ఫోన్లు స్విచ్చాఫ్‌ ఉన్నాయని, ఇప్పటి వరకు వారు అందుబాటులోకి రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు.  

విదేశాలకు నీల్‌! 
ఇదిలా ఉండగా సైంధవ్ సినిమా నిర్మాత వెంకట్‌ బోయినపల్లి కుమారుడు నీల్‌ (ఏ9) విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఆయనను కొకైన్‌ తీసుకున్నట్లు అనుమానితుల జాబితాలో చేర్చడంతో దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు చెపుతున్నారు.  

మరో డ్రగ్‌ పెడ్లర్‌ అరెస్ట్‌  
రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్‌ పార్టీ కేసులో మరో పెడ్లర్, పాతబస్తీకి చెందిన మీర్జా వాహెద్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొదట డ్రగ్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆ తరువాత వివేకానంద డ్రైవర్‌ గద్దల ప్రవీణ్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. దీంతో డ్రగ్‌ పార్టీ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)