Breaking News

నాకోసం ఆ స్టార్‌ హీరో నెలలతరబడి వెయిట్‌ చేశాడు: కమెడియన్‌

Published on Fri, 05/10/2024 - 11:12

తెలుగు వెండితెరపై టాప్‌ లేడీ కమెడియన్‌ ఎవరయా? అంటే అందరూ ముక్తకంఠంతో కోవై సరళ అని టక్కున సమాధానమిస్తారు. ఈ మలయాళ నటి హీరోయిన్‌గా, సహాయ నటిగా, కమెడియన్‌గా అలరించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో యాక్ట్‌ చేస్తూ కామెడీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది.

అలా మొదలైంది
'మూడుముళ్లు సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు మా ఇంటి పక్కన ఉండేవారు. ఒకరోజు ఇంటి దగ్గర షూటింగ్‌ జరగ్గా అందులో నాకు అవకాశమిచ్చారు. ఆ మూవీ సూపర్‌ హిట్టయింది. అలా నా జర్నీ మొదలైంది. దాదాపు 15 చిత్రాల్లో హీరోయిన్‌గా చేశాను. 900కు పైగా సినిమాల్లో నటించాను. కోలీవుడ్‌ నా పుట్టినిల్లయితే టాలీవుడ్‌ నా మెట్టినిల్లు.

పెళ్లెందుకు చేసుకోలేదు?
స్వేచ్చ కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. కచ్చితంగా వివాహం చేసుకోవాలని రూలేమీ లేదు కదా.. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. ఇక్కడికి వచ్చాకే అన్ని బంధాలు ఏర్పడుతాయి. ఎంతోమంది పిల్లలు ఉన్నప్పటికీ చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని చూసేందుకు ఒకరుండాలని ఎదురుచూడకూడదు. ధైర్యంగా ముందుకు సాగిపోవాలంతే!

తెలుగులో బిజీ
సతీ లీలావతి సినిమా కోసం కమల్‌ హాసన్‌ పక్కన హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. అప్పుడు నేను నమ్మలేదు. తర్వాత కమల్‌ ఫోన్‌ చేసి నా డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే తెలుగులో బిజీగా ఉన్నానని చెప్తే నాకోసం ఐదు నెలలు వెయిట్‌ చేశారు. ఆ మూవీ చాలా బాగా వచ్చింది.

ఆరోగ్యం బాగోలేదని రూమర్స్‌
ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోలేదని, ఖర్చులకు డబ్బుల్లేక దీన స్థితిలో ఉన్నట్లు రూమర్స్‌ వచ్చాయి. మా అక్కవాళ్లందరూ నన్ను ఇంట్లో నుంచి గెంటేశారని కూడా రాసేశారు. కానీ అలాంటివేమీ జరగలేదు. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. అలాగే నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు' అని కోవై సరళ చెప్పుకొచ్చింది.

చదవండి: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. హీరోయిన్‌కు ఊహించని ప్రశ్న!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)