Breaking News

ప్రాణాలతో చెలగాటమాడే థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌.. సీజన్-3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published on Thu, 01/30/2025 - 21:10

2021లో రిలీజై అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్‌ 'స్క్విడ్‌ గేమ్'(Squid Game).  తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో ఇటీవల మరో సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కొరియన్‌ వెబ్ సిరీస్‌కు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సీజన్‌-2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరుసగా రెండు సీజన్స్ సూపర్ హిట్‌ కావడంతో మేకర్స్ మరో సీజన్‌ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.

తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్‌-3  ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ జూన్ 27న స్క్విడ్ గేమ్-3ని స్ట్రీమింగ్‌కు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. దీంతో ఇలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ఇష్టపడే ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్క్విడ్‌ గేమ్ స్టోరీ ఏంటంటే..

ఒక్కమాట‌లో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేద‌ల‌ను ఒక చోట చేర్చి.. వారితో ఆట‌లు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్  చేస్తుంటారు. విన‌డానికి చిన్న క‌థ‌లా అనిపిస్తున్నా ఒక్క‌సారి సీజ‌న్ మొదలెడితే పూర్త‌య్యేదాకా చూడకుండా ఉండలేరు. క‌థ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాల‌నుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జ‌రుగుతుందో ఉహించ‌లేం!

జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్‌గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)