Breaking News

తీవ్ర విషాదం.. బాత్‌రూమ్‌లో విగతజీవిలా మారిన సింగర్!

Published on Fri, 07/07/2023 - 17:02

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియన్ సింగర్ లీ సాంగ్ యున్ శవమై తేలింది. తన ప్రదర్శనకు కొద్ది నిమిషాల ముందే బాత్‌రూమ్‌లో విగతజీవిలా కనిపించింది. జూలై 6న  జరిగిన ఘటన ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ప్రస్తుతం ఆమె మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

(ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల)

స్థానిక కొరియన్ మీడియా కథనం ప్రకారం.. బాత్‌రూమ్‌లో లీ సాంగ్ యున్ మృతదేహాన్ని గుర్తించిన ఈవెంట్ సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ప్రదర్శన ఇవ్వడానికి ముందే ఈ విషాదం జరగడంతో ప్రతి ఒక్కరూ శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో ఈ మిస్టరీ మరణంపై అక్కడి అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. లీ సాంగ్ యున్ తనదైన టాలెంట్‌తో సోప్రానో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సియోల్ నేషనల్ యూనివర్శిటీ చదువుకున్న ఆమె సంగీతంలో అసాధారణమైన  ప్రతిభను కనబరిచింది. సంగీతం పట్ల ఆమెకున్న అంకితభావంతో  న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మకమైన మన్నెస్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించింది. ఈ విషాద ఘటనతో పలువురు ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 

(ఇది చదవండి: అమ్మకు బ్రెయిన్‌ క్యాన్సర్‌.. నన్ను కూడా గుర్తుపట్టలేదు: యాంకర్‌)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)