Breaking News

చెన్నై అతలాకుతలం.. కదిలొచ్చిన స్టార్స్‌.. సూర్య బ్రదర్స్‌ ఏకంగా..

Published on Sat, 12/09/2023 - 08:31

మిచాంగ్‌ తుపాన్‌ చైన్నె ప్రజల్ని నిలువునా ముంచేసింది. కష్టాల కడగండ్లలోకి నెట్టేసింది. జనజీవనం స్తంభించిపోయింది. పేదలు, ధనికులు ఎవరినీ వదలలేదు.. అందరి నోటా ఆదుకోమన్న ఆర్తనాదాలే. తన తల్లి వైద్యం కోసం స్థానిక కాట్పాడిలో ఉంటున్న బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌, అదే ప్రాంతంలో నివసిస్తున్న హీరో విష్ణు విశాల్‌, మైలాపూర్‌ ప్రాంతంలో నివసిస్తున్న నటి నమిత తుపాన్‌ బాధితులే.

రూ.10 లక్షల విరాళం
ప్రభుత్వం సత్వరం స్పందించి నివారణ చర్యలకు ఉపక్రమించినా, మరో పక్క విమర్శల దాడి జరుగుతోంది. సినీ తారలు విశాల్‌, పార్థిబన్‌, అతిథి బాలన్‌ వంటి వారు ప్రభుత్వ అలసత్వం గురించి ప్రశ్నించారు. ఇక తుపాన్‌ బాధితులకు ఆపన్న హస్తం అందించిన వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా నటుడు సూర్య, కార్తీక్‌ తమ అభిమానులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లోని అభిమానుల కోసం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

తారల సాయం..
విజయ్‌ తన అభిమాన సంఘం నిర్వాహకులను రంగంలోకి దింపి బాధితులను తన వంతుగా ఆదుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన నటుడు విశాల్‌, పార్థిబన్‌ కూడా తన వంతు సాయం అందించారు. అదేవిధంగా హాస్యనటుడు బాలా తమ వంతు సాయం అందించారు. అలాగు లేడీ సూపర్‌స్టార్‌ నయనతార తుపాన్‌ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావడం విశేషం. ఈమె పిగ్మీ 9 సంస్థ ద్వారా వేలచ్చేరి ప్రాంతంలోని బాధితులకు శానిటరీ, మంచి నీళ్లు, బ్రెడ్‌, బియ్యం వంటి నిత్యావసర సరుకులు అందించారు.

చదవండి: ప్రశాంత్‌కు తన చేతులతో టైటిల్‌ అప్పగించేసిన అమర్‌! రైతుబిడ్డ అంటే అంత చులకనా..?

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)