Breaking News

ఓటీటీలో సంక్రాంతి సినిమా హవా.. ఒక్క రోజులోనే టాప్‌లో ట్రెండింగ్!

Published on Sun, 02/11/2024 - 18:04

కోలీవుడ్ స్టార్‌ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతికి థియేటర్ల వద్ద పోటీ నెలకొనడంతో  జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. 

బాక్సాఫీస్‌ వద్ద హిట్‌గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది.  ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ముందు నుంచే హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న కెప్టెన్‌ మిల్లర్‌కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన రెండో రోజే టాప్‌లో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ హీరో వెంకటేశ్‌ నటించిన సైంధవ్‌ మూవీని వెనక్కి నెట్టిన కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ ప్లేస్‌కు దూసుకెళ్లింది.  మొదటిస్థానంలో కెప్టెన్ మిల్లర్‌ ట్రెండ్‌ అవుతుండగా.. రెండోస్థానంలో సైంధవ్, మూడో ప్లేస్‌లో సల్మాన్ ఖాన్ టైగర్-3 కొనసాగుతోంది. 

ఈ చిత్రాన్ని అరుణ్‌ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించారు.  భారీ పీరియాడికల్‌ కథగా తెరకెక్కించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతమందించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)