Breaking News

ఎముకలు కొరికే చలిలో షూటింగ్‌.. పట్టువదలని విక్రమార్కుడిలా స్టార్ హీరో

Published on Mon, 02/03/2025 - 20:25

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ (Ajith Kumar) విదాముయార్చి(Vidaamuyarchi Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించగా.. త్రిష హీరోయిన్‌గా నటించారు.  అర్జున్‌ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్డెట్‌తో నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లోనూ రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.

అయితే ఈ మూవీని ‍అజర్‌ బైజాన్‌ అనే దేశంలో చిత్రీకరించారు. ఇందులో కారుతో అజిత్ కుమార్ ‍కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేశారు. ఆ సమయంలో ఓసారి అజిత్ నడుపుతున్న కారు అదుపుతప్పి కిందపడిపోయింది. అజిత్‌ కుమార్‌కు కారు రేసింగ్‌తో రియల్‌ స్టంట్స్ చేయడమంటే సరదా. అలా సినిమాల్లోనూ డూప్ లేకుండానే రియల్‌గా కొన్ని సీన్స్ చేస్తుంటారు.

తాజాగా విదాముయార్చి ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. విదాముయార్చి షూటింగ్‌ సమయంలో ఎదురైన పరిస్థితులను వీడియో రూపంలో ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇందులో అజిత్ కుమార్ స్టంట్స్‌తో పాటు.. ఎముకలు కొరికే చలిలోనూ షూటింగ్‌ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాతావరణం అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఈ మూవీని షూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో మీరు కూడా చూసేయండి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)