Breaking News

రాజకీయాల్లోకి స్టార్‌ హీరో.. ఆయన చేతుల్లో ఉందన్న నటుడు!

Published on Tue, 07/25/2023 - 16:48

నటుడు విశాల్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'మార్క్‌ ఆంటోని'. ఎస్‌ జే.సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఇందులో నటి రీతు వర్మ నాయకిగా నటించారు. నటి అభినయ, ఈ చిత్రాన్ని సునీల్‌, వైజీ మహేంద్రన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌.వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

(ఇది చదవండి: బోల్డ్ సీన్స్‌ చేయను.. అలాంటి వాటికైతే ఓకే : గుంటూరు కారం హీరోయిన్) 

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలతో చిత్రబృందం బిజీగా ఉంది. అందులో భాగంగా చిత్ర యూనిట్‌ ఇటీవల పుదుచ్చేరిలోని ఓ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నటుడు విశాల్‌ను ఒక విద్యార్థి ఆసక్తికర ప్రశ్న అడిగాడు. స్టార్ హీరో విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మీరు ఆయనకు మంచి స్నేహితుడు కాబట్టి ఆయన పార్టీలో చేరుతారా? అని అడిగాడు.

అందుకు విశాల్‌ బదులిస్తూ అది ఆ దేవుడే నిర్ణయిస్తాడన్నారు. అయితే చాలా కాలంగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. ఆకలితో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తున్నానని విశాల్ తెలిపారు. ఆకలితో ఉన్న వారికి రూ.100 సాయం చేసేవాడు రాజకీయ నాయకుడేనని.. రాజకీయం అంటే సామాజిక సేవ అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా మార్క్‌ ఆంటోని చిత్రంలో విశాల్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కాగా.. గతంలో విజయ్ 10, 12 తరగతుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలొచ్చాయి. 

(ఇది చదవండి: సినిమాల్లో నటనే కాదు.. అమ్మతనం ఉట్టి పడుతోంది!) 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)