Breaking News

నిర్మాత కన్నుమూత.. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన స్టార్ హీరో

Published on Thu, 12/04/2025 - 19:08

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కన్నీటి పర్యంతమయ్యారు. ప్రముఖ నిర్మాత శరవణన్ పార్థీవదేహనికి నివాళులర్పించిన ఆయన.. తనలోని బాధను ఆపుకోలేకపోయారు. శరవణన్ మృతిని తలచుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

దిగ్గజ నిర్మాతగా శరవణన్.. 

నిర్మాత శరవణన్ మృతితో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300 వందల సినిమాలను నిర్మించారు. ఏవీఎం ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపుకలలు, జెమిని, శివాజీ, లీడర్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించారు. ఎంజీఆర్‌, శివాజీ, జెమిని గణేశన్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లతో వంటి లెజెండరీలు.. విక్రమ్‌, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో నటించారు.

ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్‌. ఆయన శరవణన్‌ తండ్రి. మద్రాస్‌(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్‌ తొలినాళ్లలో సరస్వతి సౌండ్‌ ప్రొడక్షన్స్‌గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్‌ లిమిటెడ్‌, ప్రగతి స్టూడియోస్‌..  మేయప్పన్‌( ఏవీ మేయ్యప్ప చెట్టియార్‌) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్‌ తర్వాత శరవణన్‌ ఆ ప్రొడక్షన్‌ హౌజ్‌ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. 
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)