Breaking News

ఫ్యాన్స్‌కు షాకిచ్చిన నటి.. రెండో పెళ్లి చేసుకున్నకాజల్ పసుపతి ..!

Published on Tue, 12/26/2023 - 16:31

నటి కాజల్ పసుపతి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కో, మౌన గురు,  కథమ్ కథమ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అల్లు శిరీష్ నటించిన ద్విభాషా చిత్రం గౌరవంలో కనిపించింది. అయితే 2008లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్‌  శాండీ మాస్టర్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత విభేదాల కారణంగా 2012లో విడాకులు తీసుకుంది.

ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడారు. కానీ కాజల్ పసుపతి మాత్రం ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగానే ఉంటోంది. అయితే గతంలో ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కాజల్ ప్రకటించింది. కానీ తాజాగా ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.  శాండీతో విడాకులు తీసుకుని ఇప్పటికే 11 ఏళ్లయింది. తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ పాత పెళ్లి ఫోటోను షేర్ చేసింది. 

కాజల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఫైనల్‌గా రెండో పెళ్లి చేసుకున్నా.. నన్ను క్షమించండి ఫ్రెండ్స్.. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా..మరికొందరు మీ భర్త ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. అయితే కాజల్ కేవలం తన ఫోటోనే షేర్ చేయడంతో ఫ్రాంక్ చేసి ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. లేదా ఏదైనా మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేసి ఉంటుందని అంటున్నారు. రెండో పెళ్లిపై క్లారిటీ రావాలంటే కాజల్ స్పందించాల్సిందే. అయితే గతంలో ఆమె ఓ బీజేపీ నేతను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)