అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు
Breaking News
మహేశ్‌బాబుతో యాక్టింగ్.. సెట్లో ఎలా ఉంటారంటే?
Published on Sun, 03/22/2026 - 12:15
కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కితే ఆ కిక్కే వేరంటోంది బాలీవుడ్ నటి నీరూ సెహగల్. ఈమె కీలక పాత్రలో నటించిన కొహ్రా వెబ్స సిరీస్ రెండో సీజన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది నీరూ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటులుగా సినిమా, సిరీస్‌ల కోసం మేం ఎంతో కష్టపడతాం.
ఎప్పటికీ మర్చిపోను
అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిసినప్పుడు అంతకంటే సంతోషం ఇంకేముంటుంది? నేను అమెరికాలో పెరిగినప్పటికీ పంజాబీ సాంప్రదాయాలకు ఎప్పుడూ కట్టుబడే ఉన్నాను. నా మూలాల్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆడిషన్ ద్వారానే కొహ్రా సీజన్‌కు ఎంపికయ్యాను. నా పాత్ర ఎంతో బలంగా ఉంటుంది. ఇలాంటి బలమైన రోల్స్ మరిన్ని చేయాలనుంది. కథ బాగుండి, మంచి పాత్ర ఆఫర్ చేస్తే దక్షిణాదిలోనూ నటించడానికి రెడీ..
మహేశ్‌బాబుతో యాక్టింగ్
రెండేళ్ల క్రితం ఓ యాడ్‌లో మహేశ్‌బాబుతో కలిసి పని చేశాను. ఆయన పెద్ద సూపర్‌స్టార్ అయినప్పటికీ సెట్లో చాలా వినయంగా ఉంటాడు. డెడికేషన్‌తో పని చేస్తాడు. దానివల్ల షూట్ అంతా చాలా సౌకర్యంగా జరిగింది. ఆయన ఏకాగ్రత, క్రమశిక్షణ.. ఇలా తనను చూసి చాలా నేర్చుకోవచ్చు అని నీరూ సెహగల్ చెప్పుకొచ్చింది.
చదవండి: ధురంధర్ 2 విజయం వెనక తెలుగు సినిమా: ఆదిత్య ధర్
Tags : 1