Breaking News

కేఎల్ రాహుల్‌ ముద్దుల కూతురు.. పేరు రివీల్‌ చేసిన అతియాశెట్టి!

Published on Fri, 04/18/2025 - 15:11

బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గతేడాది అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు రాహుల్‌తో డేటింగ్‌లో ఉన్న ముద్దుగుమ్మ పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. వీరి వివాహా వేడుక ముంబయిలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇటీవల పుట్టిన బిడ్డకు ఇప్పటి వరకు పేరు పెట్టలేదు. రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌తో బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా అతియాశెట్టి- కేఎల్ రాహుల్‌ తమ ముద్దుల కూతురికి నామకరణం చేశారు. ఈవారా విపుల రాహుల్‌ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని అతియాశెట్టి శెట్టి సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాదు ఈ పేరుకు అర్థం కూడా చెప్పేసింది. ఈవారా అంటే దేవుని గిఫ్ట్ అని.. విపుల అంటే అమ్మమ్మ (అతియా శెట్టి వాళ్ల అమ్మమ్మ) (మనా శెట్టి తల్లి) పేరు వచ్చేలా ఆమెకు గౌరవంగా.. రాహుల్ అంటే పాపా(నాన్న) అని అర్థం వచ్చేలా పెట్టినట్లు వివరించింది.

kl

కాగా.. ఇటీవల అతియాశెట్టికి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. తన మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందని అన్నారు. తనను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని తెలిపారు. తన జీవితమంతా సినిమా చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ గడిపానని.. ఈరోజు తన మనవరాలిని పట్టుకున్నంత ఆనందం ఎప్పుడూ కనిపించలేదని సునీల్ శెట్టి ఎమోషనల్ నోట్‌లో రాసుకొచ్చారు. తన మనవరాలి చేయి పట్టుకుని ఉన్న తన తల్లిని చూడటం కూడా జీవితాంతం గుర్తుండిపోయే అందమైన క్షణమని చెప్పారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)