అమిర్ ఖాన్‌తో పెళ్లి.. మా పేరేంట్స్ షాకయ్యారు: కిరణ్ రావు

Published on Sun, 03/09/2025 - 16:49

దర్శకనిర్మాత కిరణ్‌రావు గురించి బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌కు మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే. 2005లో ఆమిర్‌.. కిరణ్‌ రావును రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్‌- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్‌ అనే కుమారుడు జన్మించాడు. దాదాపు 16 ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యా, భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు. గతేడాది లపతా లేడీస్‌ మూవీతో సూపర్ హిట్‌ అందుకున్నారు కిరణ్ రావు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ‍్యూకు హాజరైన కిరణ్ రావు తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమీర్‌ఖాన్‌తో పెళ్లి విషయం గురించి మా తల్లిదండ్రులతో చెప్పితే వారంతా షాక్‌కు గురయ్యారని తెలిపింది. నా పేరేంట్స్ ఆందోళన చెందారని వివరించింది. అంతేకాదు తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని చెప్పారని వెల్లడించింది. అమీర్ గొప్ప నటుడని.. అతనికున్న పేరు, ప్రతిష్టలతో నీపై ఒత్తిడి ఉంటుందని సూచించారు. అయినప్పటికీ అమిర్‌ ఖాన్‌ను పెళ్లాడేందుకు నిర్ణయించుకున్నట్లు కిరణ్ రావు తెలిపారు. అమిర్ గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. కాగా.. గతేడాది అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లికి కిరణ్ రావు హాజరయ్యారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)